Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

ఆత్మవిచారము

[6 వ

మరియు జ్ఞానదాతలైన గురువులు తమ శిష్యులైన జీవాత్మలకు జ్ఞానోపదేశము చేయుచు శిష్యునియందు జ్ఞానోత్పత్తినిని అహంకారమమకారనివర్తినిని చూచి వారలకు దీక్షానియమములు ఏర్పరుతురు. దీక్షలు అనేకములు, ముఖ్యముగా 1. బ్రహ్మవిత్, 2. బ్రహ్మవిద్వర, ౩. బ్రహ్మవిద్వరీయాన్, 4. బ్రహ్మవిద్వరిష్ఠః అని. మరియు నీ విషయమై నారదపరివ్రాజకోపనిషత్తునందు అనేక తరగతుల సంన్యాసములను చెప్పియున్నారు. ప్రతిదీక్షకును దీక్షా గురువులవారు దీక్షితుడైన శిష్యునికి క్రొత్తగా నొక పేరిత్తురు. ఇది పరమరహస్యము. మహాపీఠమువారికి తప్ప నితరులకు తెలియదు. ఈ ఆచారమును అనుసరించియే ఈ కాలమందు సంన్యాస వేషమును వేసికొనినవారికందరకును శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యడిత్థానంద అని ఆనందపు పేళ్లు వ్యవహారమునకు ఏర్పడుచున్నవి.

ఆరవది, చూడాకర్మ. "మాతృగర్భజాతకేశనఖాపనయన రూపం." పుట్టుకతోవచ్చిన వెండ్రుకలు, గోళ్లు, వీట్లను తీసివేయుట.

ఏడవది, కర్ణవేధ. చెవులు కుట్టుట. చూడాకర్మ, కర్ణవేధ అను నీ రెండు సస్కారములయందు కుఱ్ఱవానికి అలంకారము చేయుటకు ప్రారంభింతురు. సాధారణముగా నైదేండ్లవయస్సపుడు ఈ సంస్కారములు జరుగును.

ఎనిమిదవది, వ్రతబంధము లేక ఉపనయనము.

ఆత్ర చ సంసారకార్యం మమత్వవ్యవహారం కించిత్ జ్ఞాత్వా స్త్యేవ మేతత్ । ఏతత్ప్రకారాణాం తన్నియంతౄణాం తత్కర్తౄణాం చా పి జ్ఞానప్రయోజనతయా అంతర్ముఖీకరణం భవతి. ।