Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

ఆత్మవిచారము

[6 వ

ఐదవది, నామకరణము. నామకరణము అనగా పేరుపెట్టుట.

సర్వం చ బ్రహ్మే త్యుక్త్వా సర్వే బ్రహ్మాండకల్పకాభవం తీతి వ్యాఖ్యానా త్తేషాం పృథక్పృథ ఙ్నౌమకరణం భవతి । యద్యపి బ్రహ్మణశ్చైకత్వం । తథాపి పృథక్పృథ క్పరిభాసమానం తథాభాసనమాత్రం । అతః ప్రతిభాసమానానాం తేషాం నామాన్యపి పృథక్పృథగేవ సంతి । వస్తుతస్తు సర్వాణి నామాని సర్వస్యాఖ్యాతాని భవంతి ॥

పరబ్రహ్మ మొకటే యైనను ఆ బ్రహ్మమునందు వ్యక్తు లనేకములు కలుగును గనుక వేరు వేరు వ్యక్తికి వేరు వేరు పేరుండ వలెను.

ఇపుడు నామకరణము నడుపు నపుడు "మాస నక్షత్ర వ్యవహార నామేతి నామత్రయ ప్రవృత్తి స్సర్వత్ర దృశ్యతే” మాసనామము నక్షత్రనామము వ్యవహారనామము అని మూడు పేళ్లు పెట్టుదురు. ఈ స్థూలశరీరమునకు లోకవ్యవహారార్థముగానును శ్రౌతస్మార్తకర్మలు నడుపుటకును వ్యవహారనామము పయోగపడుచున్నది. గర్గసంహిత యను గ్రంథములో శ్రీ కృష్ణమూర్తికి నామకరణము జరిపినపుడు ఆ శిశువునకు పెట్టిన పేరు ఆ శిశువుయొక్క చెవిలో రహస్యముగా చెప్పబడె నని చెప్పియున్నది. ఇందులో రహస్యవిషయములు అనేకములున్నవి. 28 వ పుటలో "నామరూపే వ్యాకరవాణీతి" అని యున్నది. రూపమున్నపుడు నామముకూడ నుండవలెను. మొట్టమొదట మనుష్యునికి ప్రజ్ఞానాంశువు అను తురీయాత్మ యను రూప మొక్కటి. తదనంతరము, రెండవరూపము లయాత్మ, మూడవది కాలాత్మ, నాలుగవది సంకల్పాత్మ, అయిదవది ఇంద్రియాత్మ