Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

ఆత్మవిచారము

[6 వ

నంతరమేన హి జీవాభినివేశన మితి సర్వత్రోక్తం భవతి । శరీరనిర్మాణం హి రజోవీర్యాణుభి ర్జ్ఞేయం భవతి । అణూనాం ప్రత్యేక మపి తచ్ఛక్తేః విద్యమానత్వేన తన్నిర్మాణభవనం సిద్ధం భవతి।| పశ్చాద్గర్భస్థితే దేహే ఆస్తి కశ్చిదాత్మా తదణుసంబద్ధః స చాగత్య తిష్ఠతి । తత్ర తదాగ మనోత్సాహాత్తత్‌స్థితిసంబంధ పరిరక్షణార్థం సీమంతోన్నయన సంస్కారః । సీమా హి శరీరస్య తదంతం । తచ్చ తత్పరిసమాప్తి రితి విజ్ఞేయం । ఉన్నయనంచ తత్సంబంధరూప ప్రయోజనసాధన మితి తదర్థః ॥

ఈ సమయమునందే జీవాత్మ గర్భస్థపిండమునందు ప్రవేశించి యుండును (114 వ పుట చూడుడు). శరీరము కట్టబడిన తరువాత నే జీవాత్మ ప్రవేశించునని సకలశాస్త్రములయందును చెప్పియున్నది. శరీరము కట్టి అయిన పిమ్మట గర్భమునందుండు శిశు శరీరమందు ఇమిడియుండు దేహబీజ మెవ్వనిదో ఆ జీవాత్మ (112 వ పుట చూడుడు) ప్రవేశించును. అట్టి ప్రవేశమునకు సుస్వాగతమును తెలుపుటకుగా సీమంతోన్నయనము అను సంస్కారము.

మూడవది, పుంసవనము. ఈ సంస్కారము కొన్ని దేశములలో సీమంతమునకు ముందుగానే జరుగును.

స చ జీవస్య స్థితౌ సత్యాం యా యావస్థాభవతి తత్ జ్ఞాపకోయం సంస్కారః । తేన యస్మిన్ యస్మిం శ్చ యోనౌ పూర్వమాసీత్ తత్సర్వయోనేః అనుక్రమణం చైకయోనౌ తత్పరకే చ భవత్యే వేతి విజ్ఞేయం । యథా వృక్షస్య జీవస్య పశుత్వప్రాప్తౌ ప్రథమం వృక్షనిర్మాణం వృక్షజాతివ్యక్తీ క్రమేణ భవతి, పశ్చా త్పశుత్వారోపః । ఏన మేవ హి విధానం సర్వత్ర ద్రష్టవ్యం । అత ఏవ సీమంతోన్నయనానంతరం పూర్వ యోనేః శరీరనిర్మాణస్థస్య అనుకరణ ముక్తం భవతి !