Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 6

సంసారచక్రము

205

కొనుట దుర్లభము. అందువలననే ఇట్టి స్పందసమూహములస్వభావములను సమన్వయపరుచుటకుగానే కదా సంస్కారము లేర్పడినవి.


"సమ్యక్క్రియుతే పరస్పరప్రస్తావః సంస్కారః" ఇతి సూత్రం.
పరస్పరప్రస్తావైశ్చ యథాయథం జ్ఞానం భవతి ।
సర్వైః ప్రకారై స్తత్కరణ మితి హి విజ్ఞేయం భవతి ।
తత స్సంస్కారేణైన బ్రహ్మజ్ఞానసిద్ధిః ।


పరస్పరము అనగా జీవాత్మయొక్క స్పందములకును క్రొత్తగా సంపాదించుకోబోవు శరీరములయొక్క స్పందములకును సమన్వయము కలుగజేయునది గనుక సంస్కారము అని సూత్రవాక్యము. నిజమైన జ్ఞానము పరస్పరసమన్వయము కలుగజేసికొని కార్యారంభము చేయుటవల్లనే కదా కలుగును. కనుక సర్వప్రకారముల చేత పరస్పరప్రస్తావము జరుపవలెను. ఏలనంటే సంస్కారముల వల్లనే బ్రహ్మజ్ఞానము సాధ్యము. సంస్కారములు అనేకశాస్త్రములయందు అనేకవిధములుగా చెప్పియున్నవి. నలువదియెనిమిది కంటె నధికముగా నెక్కడయు చెప్పియుండలేదు.


గర్భాధాన పుంసవన సీమంత జాతకర్మ నామకరణాన్న ప్రాశన చౌలోపనయనాని, చత్వారివేదప్రతాని, స్నానం, సహధర్మచారిణీ సంయోగః, పంచానాం యజ్ఞానా మనుష్ఠానం, దేవపితృమనుష్యభూత బ్రాహ్మణా మేం తేషాం చాష్టకా పార్వణశ్రావణ్యా గ్రాయణచైత్ర్యాశ్వయుజీకార్తికీ చేతి, సప్తపాకయజ్ఞసంస్థా - అగ్న్యాధేయ మగ్ని హోత్రం దర్శపూర్ణమాసా వాగ్రాయణం చాతుర్మాస్యాని, నిరూఢపశుబంధ స్సౌత్రామణీతి. సప్తహవిర్యజ్ఞ సంస్థా-అగ్నిష్టోమాత్యగ్ని ష్టోమోక్థ్య షోడశి వాజపేయాతి రాత్రాప్తోర్యామా ఇతి సప్తసోమసంస్థా ఇత్యేతే