204
ఆత్మవిచారము
[6 వ
ములు శరీరములు, కర్మ సంసారచక్రభ్రమణము. సంస్కారములు ఎందు కుపయోగమనగా జీవాత్మయందలి స్పందములకును శరీరములయందలి స్పందములకును ఐకమత్యము కలుగుజేయుటకు. ప్రతిజన్మమునందును తైజసవైశ్వానరుడు సంపాదించి తన యజమానుడైన జీవాత్మకు నివేదించిన అనుభవములనుపట్టి జీవాత్మయొక్కయు జీవాత్మ స్వాధీనమందుండు దేహబీజములయొక్కయు స్పందశక్తులు మహాశక్తివంతములగు చుండును. క్రొత్తగా జన్మమునకు వచ్చి మాతృగర్భమందు ప్రవేశించునప్పటికి మరియొక విధమయిన స్పందసమూహములతో జీవాత్మకు సంబంధము కలుగును. తనకు తల్లికాబోవుస్త్రీయొక్కయు, తండ్రికాబోవు పురుషునియొక్కయు, మరియును మాతాపితృలయొక్క సమీపస్థులైనజనులయొక్కయు, దేహముల స్పంద సమూహములతో జీవాత్మకు సంబంధము కలుగవలసివచ్చెను.ఒకరొకరి స్పందస్వభావము ఒకవిధము గానుండును. ఇన్నివిధములయిన స్పందములనును సమన్వయపరిచితేనేగాని జీవాత్మయొక్క భూలోకవ్యవహారము ఫలవంతముగానుండదు. ఇంటి యందుండు వారొకరొకరును ఒక విధమైన అభిప్రాయముతో నుండినయెడల గృహకృత్యము బాగుగ జరుగదను సంగతి మనకందరకును తెలిసేయున్నది. 154 వ పుటయందుండు శ్రీమద్భాగవతశ్లోకములో చెప్పినయర్థమువలె ఒక సంసారమందుండు అనేకుల స్పందస్వభావములు అనేకవిధములుగా నున్న యెడల క్రొత్తగా జన్మమునకు వచ్చిన జీవాత్మ ఈ జన్మమునందు సంపాదించుకోవలెనని యనుకొని నన్ని లాభములను సంపాదించు