అధ్యా. 6
సంసారచక్రము
201
మును కట్టుకొని పిమ్మట "ఫిజికల్ ప్ళేను" అను భూలోకమునకు దిగి స్థూలశరీరమందు వసించుటకు ప్రారంభించును. మనమందరమును ఈ ప్రకారముగా వచ్చినవారమే. సంసారచక్రమందు అర్ధవర్తులమును నడచినవారము. మనము మరణముచెందునపుడు స్థూలశరీరమునువదిలి, కొంతకాలము కామమయ శరీరమునందుండి భువర్లోకానుభవములను ముగించుకొని కామమయశరీరమును వదిలి అశుద్ధమనోమయశరీర వాసులమై స్వర్గలోకానుభవములను ముగించుకొని అశుద్ధమనోమయశరీరపాతానంతరము మహర్లోకమగు హైయర్ మెంటల్ ప్ళేనును చేరుదుము. ఈ విధమున సంసారచక్రమను వర్తులమునందు రెండవ సగమును నడిచినవార మగుదుము.
పైన చెప్పిన విధమున సంసారచక్రమునందు ఏడు మజిలీ లున్నవి.
1. హైయర్ మెంటల్ ప్ళేను అను నివాసస్థలము, మహర్లోకము.
2. ప్రయాణోన్ముఖులై (ఆవిర్భావమందు) లోయర్ మెంటల్ ప్ళేను అను స్వర్గలోకము.
3. ప్రయాణోన్ముఖులై (ఆవిర్భావమందు) ఆస్ట్రల్ ప్ళేను అను భువర్లోకము.
4. భూలోకమందు జననము - వాసము. భూలోకవాసము ముగిసినవెంబడే యాతనాశరీరము అను ఆస్ట్రల్ బాడి యందు నిలిచి, (తిరోభావమందు)
5. ఆస్ట్రల్ ప్ళేను అను కామలోకము లేక భువర్లోక భాగము.