200
ఆత్మవిచారము
[6 వ
మెంటల్ ప్ళేను అను పేర వాడుదురు. జీవాత్మ ఊహాపోహవిచక్షణుడై తత్త్వార్థ సంవేదనము, యధార్థసంభాషణము, భూతహితము, మనస్సును జయించుట, అధ్యాత్మవిద్యా శ్రవణము, అమాత్సర్యము, దుష్కార్యములు చేయమి, ద్వంద్వసహిష్ణుత, ఈవి, ఇంద్రియనిగ్రహము, మొదలగు సద్గుణములను సంపాదించి వాని అభ్యాసబలమువల్ల
క్రోధః కామో లోభమోహౌ వివిత్సా౽
కృపా౽సూయా మానశోకౌ స్పృహాచ ।
ఈర్ష్యా జుగుప్సా చ మహాగుణేన
సదా వర్జ్యా ద్వాద శైతే నరేణ ॥
(సనత్సుజాతీయం)
క్రోధము, కామము, లోభము, మోహము, విషయాసక్తి, దయా రాహిత్యము, పరులయందుండు సద్గుణములను అలక్ష్యముగా వాడుట, ఆత్మస్తుతి, చింతావిలాపములు, విషయభోగేచ్ఛ, ఈర్ష్యా
(ఇతరుల ఐశ్వర్యమును చూచి ఓర్వలేమి) మొదలగు దుర్గుణములను జయించు రీత్యా సాధనచతుష్టయ సంపత్తిని చెంది సద్గురువుల నాశ్రయించి తారకోపదేశసహితదీక్షావంతులగునంత వరకును జీవాత్మలకు "హైయర్ మెంటల్ ప్ళేను" అని దివ్యజ్ఞానసమాజపు గ్రంథములయందు వాడునట్టి మహర్లోకమే నిత్యవాసస్థానము. జీవాత్మ నిత్యవాసస్థానమునుండి బయలువెడలి "లోయర్ మెంటల్ ప్ళేను" అను స్వర్గలోకమునకు దిగి అచ్చట అశుద్ధమనోమయశరీరమును కట్టుకొని (110 వ పుట చూడుడు) "ఆస్ట్రల్ ప్ళేను" అను భువర్లోకమునకు దిగి అచ్చట కామమయశరీర