ఈ పుట అచ్చుదిద్దబడ్డది
6 వ యధ్యాయము
స్తోష్యే భక్త్యా విష్ణు మనాదిం జగదాదిం ।
యస్మి స్నేతత్సంసృతిచక్రం భ్రమతీత్థం ।
యస్మిన్ దృష్టే నశ్యతి తత్సంసృతిచక్రం ।
తం సంసారధ్వాంతవినాశం హరి మీడే ॥
సంసారచక్రము
ఇంతకుముందు 31 వ పుటలోనును మరియు నితర స్థలములయందును చెప్పిన ప్రకారము సత్యమైనవస్తువు అగు పరబ్రహ్మ యొక్క అంశమైన జీవాత్మ పాంచభౌతికప్రపంచమైన క్రీడారంగమునందు ప్రవేశించి అందలి యనుభవముల నన్నిటినిని పొందుటకుగా జీవాత్మ యను పేర ప్రయాణమారంభించెను. మనుష్యేతర శరీరములయందు అతిదీర్ఘకాలము బహుదీర్ఘయాత్ర చేసి మనుష్యశరీరమందు ప్రవేశించె నని చదివితిమి. పరమేశ్వరుడు అనేకరూపములను సృష్టించి ఆ రూపములతో తృప్తిచెందక "బ్రహ్మావలోకధిషణం” బైన మానవరూపంబును సృష్టించి ఆ రూపమునందు తన కళయైన జీవాత్మను ప్రవేశపెట్టననియు చదివితిమి. మనుష్యరూపధారులైన జీవులు వారి లేతతనమునందు