ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అధ్యా. 5
ప్రవృత్తిమార్గము
195
ఆ బండపైన చీమలబారి నడిచిన గుర్తు ఏర్పడునని లోకోక్తి. అదే విధముగా నేకాభిప్రాయము గలిగి, ఏకోద్దేశముతో, ఏకకాలమందు; ఏక విధమైన, యుద్యమము చేయువారు చీమలవలె బలహీనులైనను వారు చేయబూనుకొన్న కార్యమున కెన్ని ప్రత్యవాయములున్నను అవి యెంత బలవంతము లైనను మహాకాఠిన్యముగల రాతిబండమీఁద గుర్తు లేర్పడినట్లు అనగా బలహీనము లైన చీమలశక్తికి రాతిబండ దోవ యిచ్చినట్లు ఆటంకములన్నియు తొలగి పోవును. ఉద్దేశించిన కార్యము సిద్ధించును.
ఈ విధమున సంఘసంకల్పశక్తిచేత లోకులకు తాము చేయగోరిన యుపకారములను చేయవలయును. ఇది భ్రాతృ భావము.