194
ఆత్మవిచారము
[5 వ
నారంభించిన యెడల ఆ కార్యము అతిశీఘ్రములో తమ యిష్టానుసారము అనుకూలించును. దేవాలయముల జీర్ణోద్ధారములు, దుర్నడతయందుండు జనులను దిద్దుట, మొదలగు ప్రయత్నములు పైవివరించిన సంఘసంకల్పమువల్ల సిద్ధించును.
సంఘసంకల్పసమాజమందు చేరిన వారందరును ఒకటే స్థలమందు కూడవలెనను నవశ్యము కూడ లేదు. వారు వారు వారి వారి యింట్లో కూర్చొని జపము చేయవచ్చును. అయితే అందరు నొకటే సమయమందు అనగా ప్రతి నిత్యమును ఉదయము తొమ్మిదిఘంటలకు ప్రారంభించుట అంటే అదే తొమ్మిదిఘంటలకు ప్రతి నిత్యమును ప్రతి వాడును సంఘసంకల్పమును ప్రారంభించవలెను. మరియు నొకరు ఏవిధముగా తలచుచున్నారో అదేవిధముగా నందరును తలవవలయును. ఇట్లు ఒకటే సమయమందు సంఘసభ్యులందరును వారి వారి యింట గూర్చొని విసుకుచెందక బహుదినములు జపము చేయుచురాగా ప్రతి జప్తయొక్కయు సంకల్పరూపములు (thought forms). అనేకములై శక్తిమంతములై, తుల్యరూపములుగలవై, తుల్యస్వభావవంతములై మరియు తుల్యశక్తిమంతములునై అవి గుంపులు గూడి సభ్యులు ఉద్దేశించిన కార్యమునకు తోడ్పాటులై ఆ కార్యములను చెడుప తలచిన వార్లను ఆవేశించి విరోధభావములను ప్రబలనీయకయు, సహాయభావమును పుట్టించియు ఉద్దేశమును నెరవేర్చునట్లు చేయును. ఇది మా అనుభవము. ఎవరైనను ప్రయత్నము చేసి పరీక్షించవచ్చును. చీమల బారి దినప్రతిదినమును ఒక బండపైననడుచుచు రాగా బహుకాలమిట్లు నడిచిన పిదప