190
ఆత్మవిచారము
[5 వ
గనుక మహనీయులగువారు అట్టివారికి క్షేమము కలుగజేయవలెనని దిగ్బంధముచేసి బలహీనులను కాపాడుదురు. దిగ్బంధమునకు కవచము అనియును వేరు.
కవచము అనగా నొకవిధమైన అంగసంరక్షణవస్తువు. వీరులు యుద్ధరంగమందు ప్రవేశించు సమయమందు శత్రువుల బాణములు గాని, కత్తులు, కటారులు, ఈటెలు, బల్లెములు మొదలగు పదును ఆయుధములుగాని తమ శరీరములకు తగిలి అవి తమ చర్మమును భేదించి గాయపరచనీయకుండునట్లు కత్తులు మొదలగు నాయుధముల కభేద్యమైన లోహము తమ శరీరమునకు అంగీవలె చేయించి ఆ అంగీని తొడుగుకొని కృపాణహస్తులై యుద్ధరంగములోనికి వెళ్లుట పూర్వాచారము. ఆధునిక కాలమందు కూడ ఈ యభ్యాసము ఉన్నది. మన కండ్లకు అగపడు శత్రువులు భౌతిక శత్రువులు, దృశ్యశత్రువులు, అనియును వారల ఆయుధములకు భౌతిక ఆయుధములు, దృశ్యఆయుధములు, అనియును పేళ్లు. దృశ్య (కనబడు) శత్రువులయొక్క దృశ్య (కనబడు) ఆయుధములను నిరాకరించుటకు వీరులు దృశ్య (కనబడు) కవచములను ధరించిరి. దుర్మార్గచేతనములు అదృశ్యములు. మన కండ్లకు కనబడవు. గనుక మనము ధరించు కవచములు అదృశ్యములుగా నుండవలెను. ఇట్టి అదృశ్యములైన కవచములను తమ శిష్యులయొక్క శరీరములను ఆవరించునటుల కట్టునట్టి గురువులగు పెద్దవారు తమయొక్క చిత్తములను ఏకాగ్రపరిచికొని ఆ మనస్సుతో కవచమును చింతించి చింతించి జగన్మనోమయకోశము యొక్క అణువులతో నొక కవచమును కట్టుదురు. జగన్మనోమయ