188
ఆత్మవిచారము
[5 వ
గదిలో దూరి తలుపును భద్రపరిచకొంటే తాము దిగ్బంధము చేసికొన్నట్టు అర్థము.
అథవా ఒక మహామంత్రమును జపించువాడు ఆమంత్రముయొక్క ప్రయోజనము పొందను ఆశించితే అట్టి ప్రయోజనమునకు విఘ్నము కలుగచేయవలెను అను ఉద్దేశమును మాత్రమే మనస్సునందు గల దుష్టచేతనములు తనయందు ప్రవేశించిగాని తనసమీపమునకు వచ్చిగాని ఆ మంత్రప్రయోజనమును తనకు అందనీయక చేయుట అసాధ్య మగునట్లు తనచుట్టు మెంటల్ ప్ళేను అణువులతో ఒక వలయమును ఏర్పరచుకొనుటకు దిగ్బంధము అని పేరు.
ప్రతిమంత్రమును జపముచేయువాడు అంగన్యాసము, కరన్యాసము, రక్షా, దిగ్బంధము, ధ్యానము అను నంశములను అనుష్టించును అని యింతకు ముందే చెప్పబడెను కదా. ప్రతిమంత్రముయొక్క యుపాసనావిధానమునందును “ఇతి దిగ్బంధః" అని యొక యంశము కలదు. పైవివరించిన ప్రకారము దుష్టచేతనములు తనయొక్క మనస్సున ప్రవేశించనీయక చేయు బందోబస్తుకు దిగ్బంధము అని పేరు.
దుష్టచేతనములలో ననేకజాతులు గలవు. శ్రేష్ఠమయిన మంత్రములను జపముచేయునపుడు ఆ మంత్రముల ప్రభావమువల్ల లోకమందలి దుర్మార్గస్వభావము గల చేతనములకు శ్రమ కలుగును. అట్టిశ్రమకు కారణమైన మంత్రమును జపము చేయనీయక అభ్యంతరము కలుగజేయుట దుష్టచేతనముల కభీష్టము. గనుక మనము చేయు జపములకు ప్రత్యవాయము కలుగచేయు చెడ్డచేత