Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

187

పోక యుండునట్టు ఒక గదిలో పెట్టి తలుపు మూసి తాళము వేసి యుంచితే ఆ ధనము భద్రముగా నుండునుగదా. ఆ పెట్టెలు ఉండు స్థలమునకు నలుదిక్కులయందును గోడలు గట్టి భూమిదిశను. భద్రపరచి అదే విధమున పైదిక్కు అనగా ఆకాశము (మేఘముల మార్గము) నుండి కూడ దొంగలు రాలేకుండునటుల ఆ గోడలపై, దళముగ కప్పువేసియుంచితే ధనము ఉండు పెట్టెలు భద్రపరుపబడినవి అనుకొనవచ్చును. అనగా ధనముగల పెట్టెలకు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, అధఃప్రదేశము, ఊర్ధ్వప్రదేశము అను అన్ని దిక్కులయందుండియు ఎవరైనను వచ్చి ఆ ధనమును స్పర్శించకుండునటుల భద్రపరచుట. స్వల్పమైన ధనమును గలవాఁడు ఆ ధనమును ఒక పెట్టెయందుంచి తాళమువేస్తే ఆ ధనమునకు దిగ్బంధముచేసినట్టు అర్థము. అదే విధమున ఒకానొకడు తనగదిలో కూర్చొని ఆ గదితలుపు గడియవేసికొని యితరులను రానియ్యక ఏదో ముఖ్యమైన హవ్యాసముతో నుంటే అతడు తనకు దిగ్బంధము చేసికొనియున్నాఁడు అనవచ్చును. అదే విధముగా మనస్త్రీలు అతి వెలగల నగలను ధరించి తాము నిద్రించు సమయమందు ఒకగదిలో ప్రవేశించి ఆ గదియొక్క తలుపును గట్టిగా భద్రపరుచుకొంటే దిగ్బంధము చేసికొన్నార నదగును.

లేక మానవంతులయిన స్త్రీలుగాని పురుషులుగాని తమవద్ద ధనములేకపోయినను ప్రతిమనుష్యునకును స్వభావతః పుట్టియుండు మానధనము ఏ పురుషుడైనను స్త్రీయైనను అపహరించగల ప్రయత్నములు చేయునట్టు తమకు తెలిసినట్టైతే అట్టి దుర్మార్గులు తమను స్పర్శించుటకు అనుకూలము లేకుండునటుల తాము ఒక