అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
185
లేనిస్థలమందు కదలకయే వెలుగుచున్న దీపమువలె స్తిమితముగా నుండును. ఆస్థితికే "మనోనాశము " అనిపేరు.
యత్తు చంచలతా హీనం తన్మనో మృత ముచ్యతే ।
ఏష ఏవ మనో నాశ స్త్వవిద్యా నాశ ఏవచ ।
యద్య త్సంవిద్యతే కించి త్తత్రాస్థా పరివర్జనం ॥
(జ్ఞానవాసిష్ఠము)
ఇందుకు తాత్పర్యము.—
చంచలత్వహీనము అనగా చంచలత్వము అను స్వభావమును పోగొట్టుకొన్న మనస్సును శాస్త్రజ్ఞులు "మృతం" చచ్చినది అందురు. అనగా అట్టిమనస్సు నశించినది అనబడును. అట్టిస్థితికే మనోనాశము అని పేరు.
ఒకానొకడు తనమనస్సును తాను జయించినాడా లేదా అని తనశక్తిని పరీక్షించవలె నని యభిలాష కలవాడైతే
త్యజ న్నభిమతం వస్తు య స్తిష్ఠతి నిరామయః ।
జితమేవ మన స్తేన బాహ్యప్రసర ముజ్ఝతా ॥
(జ్ఞానవాసిష్టము)
తనకు అదివరకును చాల యిష్టమైన పదార్థమును వదిలి యీవస్తువును వదలినానని ఎంతమాత్రమైనను చింతలేకయే యెవడుండగలడో వానిమనస్సు నిజముగా జయింపబడినదే యని యర్థము.
మనస్సు ఈ ప్రకారము జీవాత్మకు స్వాధీన మైనపుడు జీవాత్మ తానై ప్రయత్నించి చింతించవలె నని యిచ్ఛయించిన విషయమునే చింతించును. ఒకానొకసమయమందు "బలవా నిం