Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

181

వెంబడి మనస్సు పరువెత్తకూడదు. అట్లు కాక గుఱ్ఱములు విచ్చలవిడిగా పరువెత్తునపుడు సారథి కళ్లెముల లాగిపట్టక గుఱ్ఱములు పోవుదారిన పోనిమ్మని కళ్లెముల వదల పెట్టడు కదా. అదే విధమున నింద్రియములను వాటి త్రోవన పోనియ్యక మనస్సు ఆ యింద్రియములను ఆపుటకు బుద్ధిసహాయము కావలెను. అందువల్లనే "సర్వాదృష్టీః పరిత్యజ్య నియమ్య మనసా మనః" అని జ్ఞానవాసిష్ఠమందు చెప్పియున్నది. అనగా సర్వేంద్రియముల వ్యాపారములను వదలుమని మనస్సును మనస్సుచేత నియమించవలె నని యర్థము. ఇంద్రియములను వాటి వ్యాపారములలో ప్రవేశించక నియమించి మనస్సు తానును బహిఃప్రపంచమందు వేటలాడబోకయే స్థిరముగా ఏ విధమైన చలనమైనను లేక యుండుటకు నిర్విషయ మనస్సని పేరు.

నిర్విషయమైన మనస్సు నిశ్చలముగా పొటగ్రాపులు దీయువాని పెట్టలోనుండు అద్దమువలె నెమ్మదిగా నుండును. పొటగ్రాపువాని యద్దము తానుకదలక ఊరకుండగా ఆ యద్దమున కెదురుగానుండు వస్తువుల బొమ్మలు ఆ యద్దమునందు ప్రతిఫలించునవి కదా. ఆ రీతిననే నిర్విషయముగా మన మనస్సున్నపుడు ఇతరుల మనస్సునందలి ఇంగితములు, అనగా భావములు, అట్లనగా తలంపులు కొంచమైనను శిథిలముగాకయే నిర్విషయమైన మనస్సునందు ప్రతిబింబించును. ఇదే పరేంగితజ్ఞాన మను సిద్ధ సిద్ధి.

సహాయము చేయ బూనుకొనువానికి లోకు లందరును స్నేహితులే కదా. గనుక నతడు దుఃఖమునొందినవార్ల సమక్షమమునకు వెళ్లను జంకవలసినది అవశ్యము కాదు. ఒక వేళ తాను