176
ఆత్మవిచారము
[5 వ
యొక యుత్తరము(జాబు)గుండానో తెలుపవచ్చును. (3) ఎదుటివాడు అతి దూరాననుంటే సమాచార మత్యవసరమైతే, తంతి సమాచారము పంపవచ్చు. దీనినే టెలిగ్రాము అని వాడుదురు. (4) టెలిగ్రాములు పంపడమునకు తంతులు అవశ్యము. తంతులయొక్క యొక కొనయందు సమాచారములను పంపువాడు కొన్ని గుర్తులుగల శబ్దములనుచేయును. ఆశబ్దములు తంతియొక్క కొనన నుండు ఆపీసులో విద్యుచ్ఛక్తివల్ల వినును. ఆశబ్దములను చేర్చి వ్రాసుకొని వానియొక్క అర్థమును ఒక సమాచారముగ వ్రాసి మనస్నేహితునికి టెలగ్రాపు ఆఫీసువారు పంపుదురు. (5) మరియొక విధమైన టెలగ్రాపు కలదు. తంతులు లేని టెలిగ్రాఫు అని పేరు. అది యెట్లన్న, ఒకానొక అత్యున్నత ప్రదేశమందు కొన్ని స్తంభములను కట్టి ఆ స్తంభములపైన విద్యుచ్ఛక్తి గల వస్తువులను ఉంచుదురు. ఆయున్నతస్థలమునకు సమీపమున భూమియందు ఒక గది కట్టి అందులో కొన్నివిద్యుచ్ఛక్తి యంత్రములను స్థాపించి కొన్ని సూదులను ఉంచుదురు. ఇట్లు అనేక స్థలము యందు ఆఫీసులు ఉంచుదురు. ఈ విధముగా భూమికి సమీపమందుండు గదిలోని విద్యుచ్ఛక్తియంత్రమందు మనమాటలకు ఏర్పడిన కొన్నిగుర్తులను కొట్టితే ఆగుర్తులు మనముండు స్థలమందుండు ఆపీసునుండి వెడలి ఇతరస్థలములయందు ఉండు ఆపీసులలోని సూదులను చలింపచేయును. ఆచలనములు అను సంజ్ఞలను మాటలగా వ్రాసికొని సమాచారములుగా మార్చుదురు. ఇందుకు తంతులు అవశ్యములేదు. ఉన్నతప్రదేశములయందు అత్యున్నతములైన స్తంభములు మాత్రము కొన్ని ఆవశ్యము. అనేక వేల