Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

175

చిత్తముతో నొక పుస్తుకము చదివినను ఆటపాటలు చూచినను అటుపిమ్మట ననేకసంవత్సరములు గడిచిన పిమ్మట కూడ ఏనాటకపాత్ర మెక్కడ ఉండెను, ఎవడు ఏ పాటలు పాడెను అను మొదలుగా గల వివరములను చక్కగా జ్ఞాపకముంచుకొందురు. మరియు నేకాగ్రమైన చిత్తముతో మన స్నేహితులను తలచి ఏవైనను తలంపులను పంపితే ఆ తలంపులు అట్టిస్నేహితుల మనస్సులలో ప్రవేశించి తమను తమ స్నేహితులు తలచుకొనుచున్నారేమో అని అనుకొందురు. అది యెట్లంటే. -

భావపరివర్తనము

ఇంగ్లీషులో "థాటుట్రాన్స్పరన్సు" అని చెప్పుదురు. "థాటు” అనగా భావము, "ట్రాన్స్పరన్సు" అనగా పరివర్తనము. అనగా మనయొక్క మనస్సులోని భావమును ఇతరుల మనస్సులో పలికి వారలకు తెలియకనే చొచ్చునట్లు చేయుట. ఇది భావపరివర్తనము. లోకులు ఒకరి యభిప్రాయములను గాని భావములను గాని యితరులకు తెలుప గోరినపుడు ఏ విధముగా తెలుపింతురని విచారింతము. (1) తన యభిప్రాయములను ఎదుటివానికి తెలుపవలెనంటే ఆ యభిప్రాయములు మనయొక్క మనోమయశరీరము నుండి స్థూలశరీరమందుండు వాగింద్రియమునకు దిగిరావలెను. పిమ్మట ఆయభిప్రాయము మాటలగా రూపెత్తవలెను. మొదటివాడు ఎదుటివానితో మాటలాడుట యొకరీతి. (2) లేక యెదుటివాడు మొదటివానియొక్క సమక్షమమందు లేక దూరాన నుంటే తనమనస్సునందలి యభిప్రాయములును ఒక దూతగుండానో లేక