174
ఆత్మవిచారము
[5 వ
సాహుకారుని యింటిలో దొంగలు ప్రవేశించుటకు వీలుండదు. ఏకాగ్రత చెందిన మనస్సు కావలివానితో సమానము. ఇతరుల దుష్టతలంపులు చోరులతో సమానము. ఇతరుల దుష్టతలంపులు మనయొక్క మనస్సును ప్రేరేపించి దుష్టకార్యములు చేయునుద్యమమును కలుగజేయుట మానును.
మరియొక యుదాహరణమున్నది. అది యేదన కుమ్మరవాని చక్రము అతివేగముతో తిరుగుచుండు సమయమందు మనమెవరైనను నొక రాతిని ఆ చక్రమునకు తగులునట్టు రువ్విన యెడల నా రాయి అతివేగముతో తిరుగుచున్న చక్రమునకు తగలగానే ఆ చక్రపువేగముచే రువ్విన వాని పార్శ్వమునకే తిరిగి వచ్చును.
ఏకాగ్రచిత్తము పరిపూర్ణముగాఁ జెందిన మనస్సు అతివేగముగా తిరుగుచున్న కుమ్మరవానిచక్రముతో సమానము. ఇతరుల దుష్టతలంపులు రాళ్లవంటివి. గనుక నేకాగ్రత చెందిన మనస్సుల యందు మన యనుమతిలేనిదే అవి ప్రవేశించవు. మోక్షాపేక్ష గలవారలు జపము, ధ్యానము, మొదలగు అనుష్ఠానములు చేయువారల యనుష్ఠానములు పరిపూర్ణముగ సాధించను ఏకాగ్రచిత్త మత్యావశ్యకము. అటుగాక మోక్షాపేక్షలేక కేవల లౌకిక వ్యవహారముల లోనే ఆసక్తిగలవారలకు కూడ ఏకాగ్రచిత్త మత్యావశ్యకము. వ్యాపారము చేయువారయి ఏకాగ్రచిత్తముతో తమలెక్కలను చూచుకొన్నట్లైతే తప్పులు కలుగవు. తాము క్రయమునకు తెచ్చుకొన్న సరుకులు నూర్లకొలది తమ అంగళ్లలో నుండగా వాటియొక్క వెలలు పుస్తుకములు చూడకయే చెప్పగలరు. కేవలము ఐహికచింతతోనే యుండువారు. ఏకాగ్ర