Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ఆత్మవిచారము

[5 వ

రెండు అభ్యాసములయందును చెరుపు నిష్కర్షగా కలదు. రెప్పపాటు లేక చూచుచుండునప్పటికి కండ్లు అలసటచెంది కండ్లలో నీరుకమ్మును. అంతటితో నాయభ్యాసము వదలకనే యాచరించుచుంటే కొన్నాళ్లకు కండ్లనరములు బలహీనములై వికారరూపములు కండ్లపడును. తలనొప్పి విడువదు. అట్టి తలనొప్పి మరవ గొట్టుటకుగా బంగి మొదలగు ద్రవ్యముల నుపయోగించుదురు. ఈ విధముగా చెడుపు కలుగును. హఠయోగాభ్యాసములు దేహదార్ఢ్యమును అనుసరించియుండును. మన యింట కట్టియుంచిన ఆవు తన కట్టు వదుల్చుకొని పరువెత్తినపుడు ఆ యావును మరల దాని స్థలమునకు చేర్చుటకు రెండుమార్గములు గలవు. ఆవియే వన, మంచి లేత పచ్చి గడ్డిని ఆ యావునకు చూపి ఆ గడ్డియందలి మోహముచే నా యావు మన సమీపమునకు రాగా మెల్ల మెల్లగా నా యావు కంఠమందు త్రాడు గట్టి తొటిగుండా దాని స్థలమునకు తీసుకొని వెళ్లి కట్టుట యొక మార్గము. లేక మంచి కఱ్ఱ చేతబూని ఆ యావును తరిమి తరిమి అది అలిసి నిలిచినపుడు దానిని పట్టి కట్టు మార్గ మొకటి. ఈ రెండు మార్గములలో మొదటి మార్గము యుక్తిమార్గము. అందువల్ల మనకుగాని ఆవునకుగాని శ్రమలేదు. రెండవ మార్గము హఠమార్గము. ఆవునకు శ్రమ మనకు అతిశ్రమ. ఈ రెండవమార్గము సుఖదాయకము గాదు. కనుక చిత్తమును గూడ యుక్తిచే నిరోధించుట యత్యావశ్యకము. అతిసులభము. ఆవునుపట్టి కట్టగోరినవాడు తానుగాని ఆవుగాని శ్రమబడకనే పచ్చిగడ్డియొక్క సహాయముతో ఆవును కట్టినట్లు ఆత్మవిద్యాభ్యాసము, సాధుసంగము మొదలగు