అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
169
చేతనము ఆరూపమందు ప్రవేశించి ఆచేతనము ఆ మనోరూపముతో సహ జగన్మనోమయకోశము అను మహాసముద్రమందు అతివేగముతో విచ్చలవిడిగా సంచరించుచుండును అనియును; అట్లు సంచరించుసమయమందు ఆతలంపుతో సమానమైన గుణముగల తలంపులు తలచు స్వభావముగల జనులయొక్క మనస్సుల యందంతయు తనతో సమానమైన గుణముగల తలంపులను పుట్టించుచు, తనవంటిరూపములను అనేకములను, అట్టిరూపముల యందు నివసించగలచేతనము లనేకములను, పుట్టించుచుండు నని తాత్పర్యము. దివ్యజ్ఞానసమాజపువారి పుస్తకములలో నీరూపములకు థాట్ ఫారమ్సు (Thought-forms) అని పేరు. మనము సదా కాలమును మనస్సునం దేదో యొక విషయము తలచుచుందుము. తలచు తలంపులన్నియు మన స్వంత తలంపులు కావు. ఇతరుల తలంపులు అనేకములు పుంఖానుపుంఖములుగా మన మనస్సునందు అనుమతి లేకయే ప్రవేశించును. మనస్సు నేకాగ్రముగా నుంచుట కారంభించు సమయమందు ఇట్టి పరుల తలంపులు అనేకములు మనకు విదితములగును. కనుక మనముగా ప్రయత్నపూర్వకముగా తలంచని తలంపులకు స్థలమియ్య కూడదు. అపుడే యేకాగ్రత సాధ్యము.
మరియు చిత్తైకాగ్రతకు కొంచెము ప్రయత్నము అవశ్యము. ఈప్రయత్నము మనస్సునకు సంబంధించిన ప్రయత్నముగాని దేహమున కేవిధమైన సంబంధమునులేదు. సంతోషము, దుఃఖము, కోపము మొదలగు గుణములు మనస్సునకు సంబంధించినవే యైనను స్థూలశరీరముకూడ ఆ యా గుణములు పుట్టినపుడు తనలో