Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

165

తాను జపించు మంత్రము ఎన్నితడవలు జపించినదని లెక్కపెట్టుకోవలెనంటే మనస్సులో మరియొకభాగ మేర్పరిచి ఆ భాగముతో లెక్క పెట్టవలెను. అపుడు ఎన్ని పనులు ఏక కాలమందు జరుగవలెనో యోచింతము. మనస్సుయొక్క ఒక భాగముతో, ఏకాగ్రచిత్తముతో కట్టిన శ్రీమద్భగవంతునియొక్క విగ్రహమును పోగొట్టుకోక, నిలుపుకొని యుండుట మొదటిది. మఱియొక భాగముతో నేకాగ్రముగ మంత్రమును మననము చేయుట రెండవది. జపమాల చేతంబూని దానియందలి పూసలు లెక్కకు సరిగా త్రిప్పుచువచ్చుట మూడవది. అధమపక్షము ఈ మూడు కార్యములును ఏక కాలమందు జరుగవలెను. ఇది కష్టతరము. అనేక సంవత్సరముల యభ్యాసమువల్ల కలుగు శక్తివల్లనే గాని సాధ్యము కాదు. అందువల్లనే జపమాలికలు అనేక తరహాలవి. మనస్సుయొక్క జయము కొంచెముగా గలవారలు ఉపయోగించను సాధ్యమైన మాలలో పదునారుపూసలు మాత్ర ముండును. నూటయెనిమిది తడవలు మంత్రమును మననము చేయుటకు విశేషకాలమవును, అంతకాలము మనస్సు నేకాగ్రముగ నుంచుకొనుట చాల కష్టము. పదునారు తడవలు మంత్రమును మననము చేయుటకు స్వల్పకాలము చాలును. ఇది చక్కగా, దృఢముగా, అంతరాయము లేకయే, జపము చేయుశక్తి గలిగిన తరువాత ముప్పదిరెండు పూసలమాల నుపయోగించవచ్చును. అది చక్కగా, నిశ్చలముగా, నిరంతరాయముగా, సాధ్యమైన తరువాత ఏబదినాలుగుపూసలమాల నుపయోగించవచ్చును. ఈ ప్రకారము తనయొక్క మనస్సును ఉపాసకుడు తనయొక్క అంత