Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

ఆత్మవిచారము

[5 వ

స్సు పొంచువేయుచుండును ; గాని విద్యార్థి యేమరక జాగరూకడై యుంటే మనస్సు పరువెత్తక ఆ పుస్తకపుటయందే నిలుకడచెంది యుండును. ఈవిధముగా పలుమారు అనేక సంవత్సరములకాలము ప్రతిదినమును, ఏమిపని చేయుచున్నను ఏమరకయే నిశ్చితాత్ముడై మనస్సునకు అంకుశము వేసి వేసి స్వాధీనము చేసికొనవలెను. ఎపుడు మనస్సు తననిజమైన స్థితిని కనుక్కొనునో అపుడు తన యజమానుడైన జీవాత్మను ఏమరిచి మోసపుచ్చు ప్రయత్నమును వదలుకొనును.


యత్కృతం మనసా రామ తత్కృతం విద్ధి చా నఘ ।
యత్త్యక్తం మనసా రామ తత్త్యక్తం విద్ధి సర్వదా ॥

(జ్ఞానవాసిష్ఠం)


తాత్పర్యము——మనస్సుతో చేయబడిన కార్యమే కార్యము. మనస్సుతో చేయబడిన త్యాగమే త్యాగము. జ్ఞానేంద్రియములును కర్మేంద్రియములును బహిఃకరణములు. మనస్సు అంతఃకరణము. బహిఃకరణములును (అనగా వెలుపలి ఆయుధములును) అంతఃకరణమును (అనగా దాగి, లోపలనుండు ఆయుధమైన మనస్సును) కలిసి చేసిన కార్యమే కార్యము. కనుక మనస్సును ఏకాగ్రముగా నుంచవలెను. అనగా మనస్సును నిరోధించవలెను. అనగా మనస్సును మనము ఏవస్తువుపైన నిలిచియుండుమని నియమించితే ఆవస్తువుపైననే నిలిచియుండునట్టు అలవాటు చేయవలయును. చిత్తైకాగ్రత అని వ్యవహరింపబడు చిత్తజయమునకు అనేక మార్గములున్నను సాధారణజనులు సులభముగా సభ్యసించను సాధ్యమైన