Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ఆత్మవిచారము

[5 వ

నిపుడు అతనికేమి తోచుననగా, భాపురే, నామనస్సు అతి చంచలమే. దీని నేవిధమున నొక స్థలమందు నిలుపగలనని యాశ్చర్యము, చింతయు కలుగును. అయితే యిందు చిత్రమేమియులేదు. మనము రైలుబండిలోనుండి ఆ బండి ఘంటకు నలువదిమైళ్ల వేగముతో బరువెత్తుచుండ నాబండియందు సుఖముగా కూరుచుండు మనకు ఆ వేగము తెలియరాకున్నను మనము ఆబండిలో లేక పొలములో నిలబడియుండి వేగముతో బరువెత్తు రైలుబండిని చూచితే, భళీ, యీ బండి యింత వేగముతో బోవుచున్న దా యని విస్మయము చెందుదుము గదా. అదే విధమున మన మనస్సు అతివేగముతో నొక వస్తువుపైన యైనను కొంతకాలము నిలువక బరువెత్తుచుండిన కాలమందు మనమైన జీవాత్మలును ఆ మనస్సువెంబడి పోవుచుంటిమి. అటు గాక మనస్సు వేరు; నేను వేరు; మనస్సనునది నాయొక్క యింద్రియము; నేను మనస్సున కధిపతిని అని యెరిగి మనస్సును నిలుకడ నుంచను ప్రయత్నపడినపుడు రైలుబండిలో నుండి వేరైన పిమ్మట ఆ బండియొక్క వేగమును మనము తెలిసికొనిన విధముననే మనస్సుయొక్క వేగమును కూడ తెలిసికొందుము; అందువల్ల భయపడవలసిన యవశ్యములేదు. అధైర్యముచెంద నవశ్యములేదు. ఒకానొకడు ఒక గుఱ్ఱమును గొని దానిని సవారిచేయను తలచినపుడు అది ఎడము ఇయ్యక యజమానుని తన్నను కరువను ప్రారంభించిన మాత్రముననే అధికముగా ద్రవ్యము సెలవు చేసి కొన్న గుఱ్ఱమును యే యజమానుడైనను విడిచి పెట్టునా? విడిచిపెట్టడు గదా. అయితే ఆ గుఱ్ఱమును నయమున భయమున నభ్యాసమునకు లోబరచి తన స్వాధీనము