Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

157

గా నుండగా నేకాగ్రతను చెందినను అపుడపుడును రజోగుణప్రేరితమై ఆ రజోగుణముయొక్క స్వభావములైన విషయములలో ప్రవేశింపించు స్థితి.

నిరోధదశ యనగా సత్త్వగుణము అధికముగా నుండుటచేత నేకాగ్రత చెందిన మనస్సు ఇటునటు కదలక "యథా దీపోనివాతస్థో నేంగతే జ్వలతే పునః" గాలిలేని స్థలమునందుండు దీపము కదలకయే వెలుగుచుండు రీతిని నిలిచి యుండుట. ఈ స్థితికే యేకాగ్రచిత్తమని పేరు.

సాధారణముగా లోకవ్యవహారములయందు కాలము గడుపు జనులు తమ మనస్సులు పరువులిడుచుండుటను కనుక్కోలేరు. చంచలము మనస్సుయొక్క స్వభావము. ఐనను పరువులిడు స్వభావము గల జంతువులను స్వేచ్ఛగా పోనీయక నొక స్తంభమునకు కట్టిపెట్టితిమంటే ఆ జంతువు అట్టి కట్టును విడిపించుకొని స్వేచ్ఛగా బరువులిడను చేయుప్రయత్నములు మెండు. గంతులు వేయును. స్తిమితమువదలి కట్టినత్రాళ్లుతెంచుకొని పోవుప్రయత్నములు చేయును. ఆ జంతువును స్తంభమునకు కట్టకమునుపుకూడ గంతులువేయు స్వభావము ఆ జంతువున కుండినది. అయినను మనము శ్రద్ధతో ఆ స్వభావమును గమనించలేదు. అదేవిధముగా లౌకిక జనులయొక్క మనస్సులు బహుశా పరువెత్తు స్వభావము కలవే. ఇట్లుండ నెవడైనను ప్రయత్నపూర్వకముగా తన మనస్సు నేకాగ్రముగా నుంచవలెనని పాటుపడితే అపు డతనికి తన మనస్సు అతి చంచలమని తెలియును. ఇదివరకును మనస్సును నింద్రియములను నిరోధించను ఏ ప్రయత్నము చేయలేదు గనుక