అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
155
మనస్స్వభావములచేతను శ్రమపడి దైన్యముచెందినవాడనైనను నేను చేసిన పాపములచే బీడింపబడిన నా మనస్సు కామాతురమైనదై యున్నను ఓ వైకుంఠనాథా, నీయొక్కకథలను వినను ఇచ్ఛగొన్నదిగా గనబడదు గాన నిన్నేవిధమున చెందగలను. నీ చరితంబు లేవిధంబుగ వినగలను. అని తనదైన్యమును, తనయొక్క యింద్రియముల ప్రబలతనును భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు చెప్పి దుఃఖంచెను.
కావున జిహ్వాదీంద్రియములు ఒక్కొకటియు నొక్కొక్క దారిన లాగుచుండగా వాటిని నిరోధించను శక్తిలేని మనస్సుగల వాడు భక్తియోగముగాని, జ్ఞానయోగముగాని, కర్మయోగముగాని అనుష్ఠించలేడు. ఇంద్రియముల వెంబడి పరువెత్తనీయక మనస్సును తనకు (జీవాత్మకు) ఇష్టమైన యొక వస్తువునందు నిలుపు శక్తి జీవాత్మ సంపాదించుకోవలెను.
మనస్సును ఏకాగ్రముగా జేయవలెనను ప్రయత్నముచేయు వారలకు ఉపాసకు లని పేరు. ఉపాసకులలో ననేక భేదంబులు గలవు. అనాదియైన త్రిగుణములయొక్కయు వాటియొక్క త్రివృత్కరణభేదంబుల వలనను ఎదో యొకగుణమును ముఖ్యముగా గలవారలు. త్రివృత్కరణ మనగా మూడింటగుణించుట. పంచీకరణము అనగా నైదింటగుణించుట. ప్రకృతమందు గుణత్రివృత్కరణము ఏమని విచారించవలెను.
సత్త్వగుణము ముఖ్యమై రజోగుణము కొద్దిగను తమోగుణము కొంతయు కలిగియుండు జాతి యొకటి. రజోగుణ మధికముగను సత్వగుణము తమోగుణము ఇవి కొంచెముగా గలిగి