Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

153

వస్తువునుండి మరియొక వస్తువుపైకి దాటు అభ్యాసమును చాలించునట్టు చేయవలెను. ఇట్లు చేయుప్రయత్నమునకు ఏకాగ్రతయని పేరు. అనగా మనస్సునకు ఒక వస్తువును చూపి "ఓ మనసా యీవస్తువును విడిచి నా ఉత్తరవు పొందువరకును వేరువస్తువుపైకి పోకూడదు" అని చెప్పవలెను. చిత్తైకాగ్రతతో నేకార్యము చేసినను ఏ విషయమును చింతించినను, ఏవస్తువుగమనించినను, జ్ఞాపకము ధృఢముగా నుండును.

వాసనలను శుద్ధిచేసి కొంటేనే గాని మనస్సు మనకు వశపడదు. మనస్సు వశపడకుంటే మనము చేయు కార్యములకు వీర్యము తక్కువ. వీర్యహీనమైనకార్యములు చేసి ప్రయోజనము లేదు. లోకమందు ఏవ్యవహారమందు మనము ప్రవేశించినను, వ్యాపారము, చదువు, ఉద్యోగము, జపము, తపస్సు ఇట్టి కార్యములలో నేదియైనను ఏకాగ్రతచెందినమనస్సుతో చేసినగాని వేరువిధమున ప్రయోజనాభావమును, కాలహరణమును కలుగును. కనుక మనస్సును ఏకాగ్రముగా నుంచుకొనువిధమును విచారింతము.

చిత్తైకాగ్రత


ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే !
తదస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివాంభసి ॥

(భగవద్గీత, అధ్యా 2, శ్లో 67)


ఇంద్రియములు విషయములను వెదకుచు సంచరించుచుండగా ఏ ఇంద్రియమునైనను మనస్సు అనుసరించి వర్తించునో అట్టి మనోయుక్తమైన యింద్రియము ఆ మనస్సును ఏవిధముగానైతే