Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

ఆత్మవిచారము

[5 వ

కూడ నుండును. అట్టి ద్వేషమున్న వాట్లయందు మన మనస్సునకు అక్కర కలుగదు. రాగమున్నస్థలములో నభిమానముండును. మిగతవిషయములలో అశ్రద్ధయుండును. ఏ యే విషయములను మనము అభిమానము, శ్రద్ధ వీట్లతో గమనింతుమో వాటియందు జ్ఞాపకము స్థిరముగానుండును. అభిమానము లేక, శ్రద్ధాహీనులమై మనము చూచు, విను, విషయములయందు జ్ఞాపకము సున్న. ఇది మనయొక్క తప్పు గనుక ఏకార్యమైనను శ్రద్ధతో, అభిమానముతో చేయుచుండు వాడుకను అనగా నిలకడచెందిన మనస్సును ప్రయత్నపూర్వకముగా కలుగచేసికొంటిమంటే జ్ఞాపకము మనకు బలపడును.


శ్రీమద్భగవద్గీతయందు అర్జునుడు చెప్పినది యేమన

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం ।
తస్యాహం నిగ్రహంమన్యే వాయోరివ సుదుష్కరం ॥

(భ. గీ. 6-34)


ఓయి శ్రీకృష్ణా నామనస్సు మహా చంచలస్వభావము గలదియు, దేహేంద్రియాదులను క్రోధపెట్టి పరవశతను తెలుపునట్టిదియు, నిగ్రహించుటకశక్యమైనదియు, విషయములయందు దృఢమైన ప్రవేశము కలదియుగానున్నది. దానిని నిలుపుట గాలిని కట్టిపెట్టుట యెంతకష్టమో అట్లు శ్రమగానున్నది అని చెప్పుకొనెను గదా. అర్జునునివంటివానియొక్క మనస్సే యిట్టి స్థితియందుంటే మనవంటివార్ల సంగతి అనుకో నవశ్యముండదు. చంచలమైన మనస్సుతో నేకార్యము చేసినను ప్రయోజనములేదు. గనుక మనస్సును తనయిచ్ఛ వచ్చినట్టు పోనియ్యకూడదు. కోతివలె ఒక