అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
151
హితః" అని యున్నది. కర్దమప్రజాపతియొక్క కుమారుండును శ్రీమహావిష్ణుయొక్క లీలావతారములలో నొక్కడునైన కపిలమహర్షి వారియాశ్రమమందు యోగారూఢుడై ముల్లోకముల శాంతికొఱకుగా యోగమందు (తపస్సునందు) న్నారని యర్థము. కావున మనము కూడ ప్రతిదినమునందును కొంతసేపు లోకహితార్థము సమాహితులమై జపము చేయవలెనని భావము.
జ్ఞాపకశక్తి
ఇది యంతఃకరణశక్తి. అంతఃకరణభాగములైన మనస్సు, చిత్తము, బుద్ధి యను మూటిలో చిత్తముయొక్క స్వభావము అనుసంధానము అని యిదివరకే చెప్పబడెను కదా. అనుసంధానమనగా ఇంతకు పూర్వ మొకనాడు ఇట్టియిట్టి సందర్భములయందు ఈవిధమైన అనుభవము సిద్ధించెనుకదా. నేడును నాటి సందర్భములే తటస్థించియున్నవి గనుక నాడు సిద్ధించిన అనుభవమే నేడును సిద్ధించును అను జ్ఞాపకము. కనుక చిత్తముయొక్క ధర్మము జ్ఞాపకము. కొందరు తమకు దృఢమైన జ్ఞాపకశక్తి కలదని చెప్పుకొందురు. కొందరు తమకు జ్ఞాపకశక్తియే చాలదనుకొందురు. ఇట్టి వ్యత్యాసమునకు కారణ మేమనిన, మనల కందరకును పూర్వజన్మ వాసనలున్నవి. ఆ వాసనలను అనుసరించి కొందరికి కొన్ని వస్తువులయందు, కొన్ని విషయములయందు, కొందరు మనుష్యులయందు, రాగమును, మరికొన్ని వస్తువులు, విషయములు, మనష్యులు, వీర్లయందు రాగములేమియు గానున్నది. అదే విధముగా కొన్ని విషయములు, కొందరు మనుష్యులు, ఇట్టి వాటియందు ద్వేషము