Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ఆత్మవిచారము

[5 వ

యణువులతో పరివేష్టితమైన యినుపతునకలు అన్నియు వేడిమిని ఆకర్షించినవి. అందువల్ల వాటికి ఉష్ణతయెక్కినది. ఒక్కస్థలమందు వెలుగుచున్న అగ్ని తనతో కలియని యినుపతునకలను కూడ యెట్టు వేడిమి పొందునట్టు చేయునో అదే విధమున నొకానొకడు చింతించు తలంపులతో లోకుల యెఱుకలేకయే వారల మనస్సులలో కూడ నొకానొకని మనస్సునందలి సంకల్పములవంటి సంకల్పములు జనించునట్లు చేయవచ్చును. అట్టి వారల మనస్సులలో పుట్టు సత్సంకల్పములలో దుస్సంకల్పములకో మొదటివాడు పూచి చెందవలెను. ఇదేవిధముగా లోకమందు కోటానుకోట్లమంది అనేకవిధములైన నీచచింతనములను చింతించుచుందురు కదా. ఇట్టి నీచ సంకల్పములవల్ల కలుగు చెరుపును వర్ణింప వాచామగోచరముగా నుండును. దీనికి ప్రతిగా సత్త్వగుణప్రధానులైన రాజయోగులు, ఋషులు, దేవతలు మొదలగువారు చెప్పనలవిగానంత తపశ్శక్తి పొందినవా రనేకులు లోకహితార్థముగా తపస్సులు చేసి సత్సంకల్పశ్రేణులను ప్రతిక్షణమునందును లోకమునందు కుమ్మరించుచుందురు. గనుకనే లోకములో నీమాత్రమైనను సుఖము, శాంతము కనపడుచున్నవి. అంతఃకరణపరిశుద్ధియు, చిత్తైకాగ్రతయు లేని పదివేలమంది తలచు దుష్టతలంపుల నంతయును వాటివలన కలుగు చెడ్డఫలములనంతయును తపశ్శక్తి చెందిన మహానుభావు డొక్కడు సమాహితచిత్తముతోఁ జేయు సత్సంకల్పశ్రేణి శుద్ధపరచి లోకమునకు కీడు రానీయక కాపాడును. శ్రీమద్భాగవతము, తృతీయస్కంధముయొక్క కడపట "ఆస్తేయోగం సమాస్థాయ సాంఖ్యాచార్యై రభిష్టుతః । త్రయాణా మపి లోకానాముపశాంత్యై సమా