దేవశాస్త్రులవారు ఈ పై తప్పును సవరించిరి గాని ఏలనో తప్పే ముద్రితమైనది. పాఠకులు మన్నింతురని నమ్మెదను.
ఈ గ్రంథమునందు అనేక గమకములకు ఆకరములు గుర్తులు చెప్పబడియున్నవి గాని 6 వ యధ్యాయమునందు సంస్కారములనుగురించి వ్రాసినపుడు అచ్చుపడియుండు గమకములకు ఆకరము చెప్పలేదు. అవన్నియు నొక ప్రాచీనగ్రంథము అగు ప్రణవవాదము అను గ్రంథమునుండి యెత్తి వ్రాయబడినవి. ప్రణవవాదము కాశీదేశపు ప్రాచీనగ్రంథము.
ఈ ఆత్మవిచారము అను గ్రంథము వ్రాయుటకు ధైర్యము నిచ్చిన థియోసాఫికల్‌సొసైటీనిని, ఈ సొసైటీయందు ప్రముఖులుగానుండు శ్రీ ఆనిబెసెంటమ్మగారినిని యోగీలెడ్‌బీటరుగారినిని గౌరవపూర్వకముగా సమస్కరించి ఈ గ్రంథమును ముద్రణా త్పూర్వము చదివి సవరించిన శ్రీ అల్లాడి మహాదేవశాస్త్రులవారికిని ముద్రణాకాలమునందు ప్రూపులుచదివి సవరించిన శ్రీ చిట్టమూరు సుబ్బరాయడుగారికిని నా కృతజ్ఞతను విన్నవించుకొనుచున్నాను.
అడయారు.
1923. సం ॥ నవంబరు నెల
అద్దంకి సీతారామశాస్త్రి