Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

149

తలచి దుష్టతలంపులు అను వాయువును పుట్టించుచుంటే ఇట్లు కోటానుకోట్లమంది దుష్టతలంపులు అను చలనహేతువులను పుట్టించుచుంటే జగన్మనోమయకోశము అను సముద్రమందు అలలవలె హెచ్చుతక్కువలు కలుగును. రాజసతలంపుల అలలు రాజసస్వభావముగల వారినందరిని రాజసస్వభావతలంపులు తలచునట్లు చేయును. సాత్త్వికస్వభావముగల తలంపులు సాత్త్వికస్వభావముకల తలంపులు తలచునట్లు చేయును. దీనికి ఉదాహరణము. ఒక కొలనునందు వేయి తామరపుష్పములు తేలుచున్నను ఆ కొలనుయొక్క యొక మూలముండు తామరపువ్వును కోయను ప్రయత్నపడినవాడు ఆ పువ్వును లాగితే ఆమాత్రమునకే కొలనులోని నీళ్లయందు స్తిమితము తప్పి తద్వారా అలలుపుట్టి ఆ అలలు కొలనునంతయు ఆవరించినందున ఆ నీటిపై తేలుచున్న పుష్పములన్నియు చలించునుగదా. కొలనులోనున్న పూలపైకి ఒక పుష్పమునే కదా కదిలించినది. అయినను కదిలింపబడని మిగత పూలన్నియు కదలలేదా! అదే విధముగా జగన్మనోమయశరీరమందు తొందరకలుగచేయుటకు ప్రతిమనుష్యునకును సాధ్యము. మరియొక విధముగా నుదాహరణ మియ్యవచ్చును. కరమలవాని కొలిమియొద్ద ననేక ఇనుపతునకలున్నవి. అవి యొకటితోనొకటి తగలకయే దూర దూరముగానున్నను కొలిమిలో వెలుగుచుండు అగ్నియొక్క తీక్ష్ణమువల్ల కొలిమిలో లేకనే దూరాననుండు ఇనుప తునకలన్నియు వేడెక్కును గదా. ఇది ఎట్లు జరుగుతున్న దనగా కొలిమిలోని అగ్నియొక్క తీక్ష్ణము అందుకు చుట్టునుండు ఆకాశ అణువులలో ప్రసరించి ఆయణువులన్ని వేడిమిని ఆకర్షించినందున ఆ