144
ఆత్మవిచారము
[5 వ
యంతఃకరణముతో జేయబడు కార్యములే కార్యములు గాని మిగిలినవి కార్యములు గావని జ్ఞానవాసిష్ఠమందు చెప్పబడియున్నది. "యత్కృతం మనసా రామ తత్కృతం విద్ధి చానఘ" -కనుక మనస్సుతో చేయబడిన కార్యమే కార్యము.
ఈ యంతఃకరణ చతుష్టయమందు మనస్సు చిత్తము బుద్ధియను మూటినిని బహిఃప్రపంచవ్యాపారములయందు ప్రవేశపెట్టునది యహంకారమను భాగము.
అహమర్థోదయో యోయం సర్వానర్థైక భాజనం ।
ఏత చ్చిత్తద్రుమస్యాస్య విద్ధి బీజం మహామతే ॥
(జ్ఞానవాసిష్ఠము)
సర్వానర్థకారణమై మనస్సు చిత్తము బుద్ధి యను సంతఃకరణభాగములగు వృక్షమునకు బీజమువంటిది యహంకారము అని తాత్పర్యము. ఈ యహంకారము అనేకజన్మములయందు మననముచేసి యభ్యాసమును పొందిన రీతిన కార్యములను ప్రేరేపించును. ఈ అభ్యాసమునకే వాసన యని పేరు. కనుక మనస్సును శుద్దిచేయవలెనంటే వాసనలను చక్క పెట్టవలెను. మనస్సును శుద్ధిచేయుట అను హవ్యాసమునకు వేదాంతమందు "మనోనాశము” అనియు వాసనలను చక్క పెట్టుటకు వాసనాక్షయము అనియు చెప్పుదురు. విద్యారణ్యకృత జీవన్ముక్తివివేకము అను గ్రంథమునందు వాసనాక్షయ మనోనాశములు అని జంటగానే యుపయోగించి యున్నారు. మరియు యోగవాసిష్ఠమందు, శిఖిధ్వజోపాఖ్యానమందు-
వాసనైవ సదా రాజన్ స్వరూపం విద్ధి చేతసః ।
చిత్తశబ్దస్తు పర్యాయో వాసనాయా ఉదాహృతః ॥