Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

ఆత్మవిచారము

[5 వ

అశుద్ధమనోమయశరీరమును శుభ్రపరుచువిధమును ఆ శరీరమును ఏవిధముగా జీవాత్మయొక్క లాభమునకుగా నుపయోగించవచ్చును అను విషయములనుగురించి నివృత్తిమార్గము అను అధ్యాయమునందు వ్రాయబడును.

శుద్ధమనోమయశరీరము

ఆమృతబిందూపనిషత్తునందు మనస్సును శుద్ధమనియు అశుద్ధమనియు భాగించినపుడు "అశుద్ధం కామసంకల్పజం" అనియును "శుద్ధం కామవివర్జితం" అనియును చెప్పియున్నది. ఈ వాక్యముల ననుసరించి నీచములైన కామములైనను ఉన్నతములైన కామములైనను అన్నియు కామములే. గనుక కామసహితములైన తలంపు లన్నియును అశుద్ధకామమయశరీరమునకే సంబంధపడినవి అని అశుద్ధకామమయశరీరమునుగురించి వ్రాసినపుడు చెప్పబడెను. లోకమందు ముప్పాతికామువ్వీసముమందికి కామప్రేరితములైన తలంపులే గాని యితరములు అగుబడవు. కామరహితములైన తలంపులు చాల కష్టములు.

"మెంటల్‌ప్ళేను” యొక్క ఏడు "సబుప్ళేనుల" లో సూక్ష్మతరములైన పైమూడు "సబుప్ళేనుల” యొక్క ప్రకృతితో శుద్ధమనోమయశరీరము కట్టబడెను అని 135 వ పుటయందు చెప్పబడెను. ఈ శరీరముయొక్క మనోధర్మములయందు కామము ఏమాత్రమైనను చేరదు. ప్రతి జీవునకును నాలుగు శరీరములు ఈ కాలమందు పనిచేయుచుండును. 1. స్థూలశరీరము. ఇది మరణముచెందు నపుడు ఈ శరీరమునందలి శక్తులన్నియు స్థూల