Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

133

ఈ యజ్ఞరూపములగు పడవలు అదృఢములు, కొద్దికాలమే స్వర్గఫలమును ఇయ్యగలవి అని విరక్తిచెందగలరు. అటుగాక ధర్మవిరుద్ధమైన కామములగు వ్యభిచారాది దోషములకు లోబడువారు మన శాస్త్రములలో చెప్పిన నరకములయొక్క అనుభవముల కన్నను అతి దుఃఖదాయకములైన మనోవ్యాకులములను కామలోకమైన భువర్లోకమునందు అనుభవించి ఆ లోకవాసానంతరము ప్రాప్తసద్బుద్ధులై మరల భూర్లోకమునకు జన్మమునకు వచ్చి క్రమేణ వృద్ధికి వత్తురు. మరిగొందరు అనేక జన్మములందు దుష్ట కామయోజనవల్ల స్వభావతః చెడ్డవారై శ్రీభగవద్గీత 16 వ యధ్యాయమందు చెప్పబడిన ఆసురసంపత్తిని జెందుదురు. వీరందరును కామలోకమందు బహువిధానుభవములను బొంది క్రమేణ కామమయశరీరమును శుద్ధిచేసికొని వృద్ధికిరాగలరు.

భువర్లోకము అను కామలోకమును గురించియు కామమయ శరీరమును గురించియు మాత్రమే ఒక గ్రంథము వ్రాయతగినన్ని విషయములున్నవి. ఐనను కొన్ని సంగతులను మాత్రము చెప్పి ఇంతటితో నిలుపవలయును. మరల నివృత్తిమార్గము అను అధ్యాయమునందు కామమయశరీరమును శుద్ధిచేయుటనుగురించి వ్రాయునపుడు వ్రాతుము.

కామమయశరీరమునకు కూడ మరణావస్థ కలదు. అనగా ఆ శరీరమును కట్టియుండు అణువులు చెదిరిపోయి అవి సంపాదించిన స్పందశక్తులన్నియు కామమయశరీరపు దేహబీజమునందు ఇమిడియుండు సమయము. ఈ విషయమును "సంసారచక్రమను” అంశమునుగురించి వ్రాయునపుడు వ్రాయనగును.