Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ఆత్మవిచారము

[5 వ

ఆహారనియమము, నీచమనోభావములను వదిలి ఉత్తమమనోభావములను చింతించుట, చదువు మొదలగు వ్యాసంగములవల్ల మెదడు స్ఫురత్తుగా పనిచేయునట్టు అయితేనే గాని ఆ రూపమునకు శరీరత్వము రాదు.

భువర్లోకప్రకృతికి ఒక స్వభావము కలదు. భూలోకపు అణువుల వలెనే (123 వ పుట చూడుడు) తమ యిచ్ఛానుసారము స్థలము విడిచి స్థలమునకు పోవు శక్తియు ఇష్టమున్నంతకాలము అచ్చట నుండుశక్తియును గాక జీవాత్మ ఏ విధములైన తలంపులను తలచినను ఏ విధములైన వేషములను వేయవలెనన్నను ఆ వేషములుగా మారుటకును శక్తికలదు. ఈ శక్తిని యోగులు ప్రయత్నపూర్వకముగా నుపయోగించి లోకులకు సహాయముచేయుదురు. శ్రీమద్రామాయణమునందు మనము చదువు ప్రకారము రాక్షసులు కామరూపులు, అనగా ఇచ్ఛవచ్చిన రూపములను ధరించు శక్తిగలవారు. ఇదే కామమయశరీరపు శక్తి. "దివ్యజ్ఞానసారము" అను పేర నొక గ్రంథమును శ్రీ చిట్టమూరు రామయ్యపంతులుగారు వ్రాసి ఇటీవల అచ్చుపడియున్నది. అందు "అదృశ్యసహాయులు" అని యొక అధ్యాయమున్నది. ఆ అధ్యాయమును చదువ వలయును.

కామమయశరీరము స్థూలశరీరముయొక్క ఆకృతిని ధరించును అని చెప్పినపుడు ఒక విశేషమును మరువకూడదు. స్థూలశరీరము స్థిరమై చేతులు చేతులుండుస్థలమునందే యుండును. కాళ్లు, ముక్కు, తల, చెవి మొదలగునవి వాని వాని స్థలములను విడువవు. కామమయశరీరపు అణువులన్నియు సదా కామమయ