Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

129

జన్మముల నెత్తి ఆ జన్మములందు సంపాదించిన మనస్సుయొక్క శక్తులు ముదురుపర్యంతమును స్వతంత్రముగా నిలువను శక్తి చెందదు. భూలోకపుశిశువునకు ఆహారముమొదలగువానివల్ల ఏవిధముగా దేహము పెరుగునో అదే విధముగా భువర్లోకపుశిశువు అయిన కామమయశరీరమునకు పటుత్వము రావలెనంటే స్థూలలోకపార్శ్వమునుండి స్థూలశరీరముగుండా ఒక విధమైన శక్తియు సూక్ష్మలోకపార్శ్వమునుండి మనోమయశరీరములనుండి ఒకవిధమైన శక్తియు ఈ రెండును చేరితేనే గాని పెంపులేదు.

జనబాహుళ్యము కామమయశరీరముగుండా పనిచేయుదురు గాని స్థూలశరీరమును వదిలి తానుగా నిలిచిన కామమయశరీరమందు పనిచేయుట అరుదు. ఈ శక్తిగలవారు కొందరే. స్థూలశరీరమును వదిలి కామమయశరీరమునందు నిలిచినవానిని భూలోకదృష్టితో కనుక్కొనుట సాధ్యము కాదు. యోగాభ్యాసముచేసి తద్వారా సంపాదించిన సూక్ష్మదృష్టిగలవారేగాని యితరులు చూడలేరు. అట్టివారి కాశరీరము చాల కాంతివంతముగా కనబడును.

ఇటికలు బండ్లలోతెచ్చి కుప్పలుగా బోసియుంచిన మాత్రమున ఆ యిటికలు గోడలు అనిపించుకోవు. సున్నముతో కట్టిన పిదపనే గదా ఆ యిటికలు గోడలగును. అదే విధముగా కామమయశరీరము భువర్లోకమునందలి సప్తవిధప్రకృతియొక్క సమూహముగా జీవాత్మశరీరములవెంబడి యొక రూపముగా నిలిచినంత మాత్రమున ఆ రూపము కామమయశరీరము అనిపించుకో చాలదు. జీవాత్మ బహువిధములైన ప్రయత్నములవల్ల - అనగా