అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
127
నిస్సారంబు లనియు దుఃఖమూలంబులనియు నెరిగి విరక్తి చెందునట్లు ఇతరుల బోధవల్ల విరక్తిపుట్టదు. విరక్తిపుట్టిన గాని సాధన చతుష్టయసంపత్తి లభించదు. సాధనచతుష్టయసంపత్తి లేనిదే జ్ఞానోదయము లేదు.
వైరాగ్యస్య ఫలం బోధః బోధ స్యోపరతిః ఫలం ।
స్వానందానుభవాచ్ఛాంతిః ఏషైవోపరతేః ఫలం ॥
యద్యుత్తరోత్తరాభావః పూర్వపూర్వంతు నిష్ఫలం ।
(వివేకచూడామణి)
కనుక కామమయశరీరము అత్యావశ్యకము.
భూర్లోకముమొదలైన లోకములయందు - అనగా ఫిజికల్ ప్ళేను (Physical plane) మొదలగు ప్ళేనులయందు, ప్రకృతి సప్తీకరణమైనదని 116 వ పుటయందు చెప్పబడెను. అందువలన భువర్లోకము అగు ఆస్ట్రల్ ప్ళేనునందు కూడ నేడువిధములగు ప్రకృతి స్థౌల్యములనుపట్టి ఏర్పడిన భాగములున్నవి. అట్టి ఏడింటికిని “సబుప్ళేనులు" అని పేరు. స్థూలాతిస్థూలమైనది మొదటి సబుప్ళేను. అంతకంటె తక్కువస్థూలము రెండవసబుప్ళేను. ఇదేవిధమున మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది అని ఏడు “సబుప్ళేనులు” న్నవి. ప్రతి సబుప్ళేనుయొక్క అణువులు ఎంతో (కొంచముగానో, అధికముగానో) "ఆస్ట్రలుబాడీ” అను కామమయశరీరమునం దున్నవి. అన్ని సబుప్ళేనుల ప్రకృతియును చేరి ఏర్పడినది కామమయశరీరము అని మరల నొక్కి చెప్పుతున్నాము. చాలమట్టుకు మనోభావములు (Emotions) పరిశుద్ధములైన వానిని మనము చింతించు శక్తివచ్చునపుడు పై "సబు