Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

121

ఆహారమువల్ల కలుగు బలమునకు సమర్థతకలుగచేయునది సూర్యప్రకాశము. అట్టి సూర్యప్రకాశమునందుండు ప్రాణశక్తి నాకర్షించి ఛాయాశరీరము స్థూలశరీరమున కిచ్చును. ఘాతలుతగిలినవారికి ఆసుపత్త్రిలో శస్త్రవైద్యము చేయునప్పుడు మైకపదార్థములను వాసన చూపుదురు. ఆ ద్రావకశక్తివల్ల స్థూలశరీరమంతయు వ్యాపించి యుండు ఛాయాశరీరమును స్థూలశరీరమును విడిచి బయటికి పారదోలుదురు. పిమ్మట స్థూలశరీరమును కత్తులతో కోసినను మనకు నొప్పి ఎరుకకురాదు. ఛాయాశరీరమువల్లనే దేహబలము, నొప్పులు, మొదలగునవి స్థూలశరీరమునకు అనుభవసాధ్యములు.

స్థూలశరీరము మరణముచెందునపుడు ఛాయాశరీరము స్థూల శరీరమును విడిచి బయటికిపోవును. స్థూలశరీరముండునంతవరకును ఛాయాశరీరముండును. స్థూలశరీరమునకును ఛాయాశరీరమునకును నొక సూక్ష్మసూత్రసంబంధ మున్నది. ఆ సూత్రమును భేదించితే (తెంచితే) స్థూలశరీరమునకు వెంటనే మరణము కలుగును. గర్భస్థ శిశువునకును తల్లికిని సంబంధ మొక నాభినాళసూత్రమున్నది అని మనకందరికిని తెలిసిన విషయము. నాభినాళసూత్రముగుండా తల్లి దేహమందలి రక్తము శిశువుయొక్క శరీరమును ప్రవేశించును. శిశువు గర్భమునందుండు కాలమందు ఏకారణముచేతనైనను శిశువు వును తల్లిని కలిపియుంచిన నాళము తెగితే వెంటనే శిశుశరీరము మరణమును చెందును. అదే విధమున ఛాయాశరీరమునకును స్థూలశరీరమునకును సంబంధముగనుండు సూత్రమును ఎవరైనను తెంచితే స్థూలశరీరము వెంబడే మరణముచెందును. ఇట్టి కార్యము యోగమువల్ల సంపాదించిన శక్తిగలవారిచేతనే గాని యితరులచేత