Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఆత్మవిచారము

[5 వ


చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభం ।
రుదంతం సప్తధైకైకం మారోదీరితి తాన్ పునః ॥
(శ్రీమద్భా- 6 స్కం, 18 అధ్యా, 62 శ్లో.)


ఇంద్రు డాసవతితల్లియొక్క యుదరంబును యోగబలంబునం బ్రవేశించి “కాంచనప్రభావిశోభితంబైన గర్భమును (పిండమును) వజ్రాయుధమున నేడు ఖండములుగాఁ గోసి...... క్రమ్మఱ నా ఖండముల నొక్కొక దాని ప్రత్యేకం బేడేసి తునియలు గా దఱిగె” నని యర్ధము. ఇందువలన ఏడు తునక లొక్కొకటియు నేడేసి చిన్నతునకలు, అన్నియు గలిసి నలువదితొమ్మిది తునకలు. ఏడుప్ళేనులనును ప్రతిప్ళేనుయొక్క యంతర్భాగము లైన ఏడేసి సబుప్ళేనులనును (Sub-planes) గుణించితే నలువదితొమ్మిది సబుప్ళేను లైనవి. దీనికి సప్తీకరణము అని పేరు,


ఛాయాశరీరము


ఇది స్థూలశరీరముయొక్క భాగము. స్థూలప్ళేను (Physical Plane) లో ఘనీభూతములైన మూడు భాగములతో మనకు భోగాయతనమైన స్థూలశరీర మేర్పడినది. స్థూలప్ళేనులో సూక్ష్మభాగము లైన మిగిలిన నాలుగు భాగముల ప్రకృతివల్ల కట్టబడినది ఛాయాశరీరము. ఇందులో అంగాంగములు మన స్థూలశరీరము నందలి అంగాంగములవలెనే యుండును. ఛాయాశరీరము స్థూల శరీరములో దూరి యిమిడియుండును. సూర్యబింబమునుండి ప్రాణశక్తులు లోకముపైన నెడతెగక కురియుచుండును. ఆ శక్తులను అకర్షించు శక్తి ఛాయాశరీరమున కున్నది. స్థూలశరీరమునకు