అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
119
సప్తీకరణము
అని యొక ముఖ్యమైన సంగతి. పాంచభౌతిక ప్రపంచమునందు అయిదు ప్ళేనులు అని వర్ణించినందు మాత్రమున సప్తీకరణమును నిరాకరించినవారము కాము. 26 వ పుట యందు సత్యలోకమునకు పైన రెండు లోకములున్నవని చెప్పియున్నది. పాంచభౌతిక ప్రపంచపు అయిదుప్ళేనులకుపైన రెండు లోకములున్నవని 26 వ పుటయందు చెప్పబడిన రెండు లోకములును రెండుప్ళేనులు. పాంచభౌతికప్రపంచమందు అయిదు ప్ళేనులు, అంతకు పైన రెండు, ఇవంతయు కలిసి ఏడుప్ళేనులు. వానిపేళ్లు; 1. ఆదిప్ళేను, 2. అనుపాదకప్ళేను, 3. నిర్వాణిక్ ప్ళేను, 4. బుద్ధిక్ ప్ళేను, 5. మానసిక్ ప్ళేను, 6. ఆస్ట్రల్ ప్ళేను, 7. ఫిజికల్ ప్ళేను, అని యేడుప్ళేనులు. నిహితాన్సప్త సప్త” అను వచనమును మరువకుడు. మరియు, ప్రతిప్ళేనులోనును మిగిలిన ఆరు ప్ళేనుల ప్రకృతికి సంబంధించిన భాగములున్నవి. అనగా ప్రతిప్ళేనులోనును ఏడు భాగములున్నవి. ఏడు ప్ళేనుల యొక్క అంతర్భాగములు ఒట్టుకు ఏడేళ్లు = నలువదితొమ్మిది. దీనికి సప్తీకరణమనిపేరు. ఇందునుగురించి మననము చేసి అవగాహనచేసికొనవలయును. లోకమంతయు నలువదితొమ్మిది భాగములుగా నేర్పడినది కదా. ఇందుకు సమీపార్థముగల పురాణకథ యొకటియున్నది. శ్రీమద్భాగవతము, షష్ఠస్కంధము 18 వ అధ్యాయమునందు మరుత్తుల జన్మకథానువర్ణన మున్నది. అందు కశ్యపఋషిభార్యయైన దితియొక్క గర్భమందుండిన పిండమును ఇంద్రుడు గర్భమును ప్రవేశించి