అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
117
తండ్రులు బడియందుపాధ్యాయులు మొదలగు వారు తమకంటె నున్నత దశయందుండు మహాపురుషులు బాలశరీరములం దుందురని యెరిగి వారిని అతి జాగరూకతతో పెంచి చదివించి లోకసేవార్ధము సిద్ధపరిచి ధన్యులుగావలెను.
స్థూలశరీరమునకు ఆహారము ముఖ్యము. "ఆహారశుద్ధౌ సత్త్వశుద్ధిః" అని శ్రీరామానుజాచార్యులవారు బోధించియున్నారు. ధర్మశాస్త్రములలోనును బాలురకును బ్రహ్మచారులకును ఉప్పుకారము లధికముగానుండు ఆహారములను ఇయ్యకూడదు అని విధించియున్నది. "న పలాండుం భక్షయేత్" అని యొక ధర్మశాస్త్రవాక్యమున్నది. మనము భోజనము చేయు పదార్థములు సాత్త్వికములనియు రాజసములనియు తామసములనియు భాగింపబడియున్నవి. శరీర మారోగ్యవంతమై దృఢముగా నుండవలెను. పరిశుద్ధములగు ఆహారమును వ్యాయామమును (Physical Excerise) మంచి గాలియును ముఖ్యములు. సత్త్వగుణ మభివృద్ధికావలెననుట జీవాత్మయొక్క క్షేమకారణము. రాజసతామసగుణములు మృగశరీరములలోనే స్థిరముగ నేర్పడినవి. మనము భుజియించు నాహారములయందు సాత్వికస్వభావపు అణువులు అధికముగానున్న యెడల శరీరముపరిశుద్ధముగా పెరిగి సత్త్వగుణమధికమగును. స్నానము ప్రతినిత్యమును చేయవలయును. లేకున్న స్థూలశరీరమందు రోమకూపములు మురికివల్ల మూతపడిపోవును. శరీరమందుండు విషములు రోమకూపములగుండా స్వేదరూపముగా బయట పడవలెను. కనుక రోమకూపములు బాగుగ పనిచేయు నటులుండుటకు స్నానమావశ్యకము. మద్యపానము,