116
ఆత్మవిచారము
[5 వ
ములను శిశుశరీరమున కలుగు నవ్వులవలనను దుఃఖభయభావముల వలనును నిష్కారణఏడ్పువల్లనును కనుపరుచుచుండును. యక్షులు, గంధర్వులు మొదలగు చిల్లర దేవతలు శిశువు లున్నచోట వచ్చి యుండి వారలకు సంతోషము కలుగునట్లు పాటలు పాడుచు ఆటలాడుచుందురు.
శిశువుయొక్క శరీరము ముదురుచు రాగా జీవాత్మ కొంచెము కొంచెముగా ఆ శరీరమునందు తాను ముందరికన్న నధికకాలము వసించుచుండును. చిన్నబిడ్డలకు ఒక విధమైన దివ్యదృష్టి స్వాభావికముగా నుండును. శిశువుయొక్క మెదడు ముదురుచురాగా జీవాత్మ తన అశుద్ధమనోమయశరీరము (Lower Mental Body) ను శిశువుశరీరముతో జతపరుచును. చిన్నబిడ్డలు పెరుగుకాలమందు తలిదండ్రులు వారలను భయపరచకూడదు. బుద్ధిహీనులైన తలిదండ్రులు బిడ్డలు తులుపితనము చేయుచున్నారు, వార్లను పట్టుట కష్టము అని బిడ్డలకు నల్లమందు ఇచ్చి నిద్రపోగొట్టుదురు. తమ సుఖానుభవములకు బిడ్డలు అడ్డపడుచున్నార రని తలచి స్వార్థపరులైన తల్లులు బిడ్డల ఆరోగ్యమును నల్లమందు అను విషమునిచ్చి పాడుచేతురు. ఈ కాలమందు ఎట్టి మహాపురుషులు భూమియందు జన్మించుచున్నారో అనేకులకు తెలియదు. శ్రీ జగద్గురువులవారి యవతారకాలము అతిసమీపముననున్నది. ఆ మహాపురుషులు అవతరించుటకు ముందే అనేకమంది తపోధనులుగానుండినవారు జన్మమును గోరి జన్మించి శిశుత్వ బాల్యము లను అవస్థలను దాటి శ్రీవారియవతారకాలమునకు లోకసేవాధురీణులై యుండవలెనని అనేకులు పక్వజీవులు జన్మించుచున్నారు. కనుక తల్లులు