అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
115
గుండము స్త్రీశరీరమనియు ; ఆ హోమగుండమునందు రేతస్సును ఆహుతిగా, వేసి దేవతలు హోమముచేసిరనియు ; అందువలన గర్భము కలిగినదనియు చెప్పియున్నది. ఈ భాగమును జాగ్రతగా చదువవలెను. అందువలన భూతసూక్ష్మములగుండా అశుద్ధమనోమయశరీరము (Lower Mental Body), కామమయశరీరము (Astral Body), స్థూలశరీరము (Physical Body) అనునవి జీవాత్మకులభించిన వివర మవగాహన యగును.
సారంగధరసంహిత మొదలగు వైద్యగ్రంథములను పఠించితే గర్భిణీస్త్రీకి ఎట్టి ఆహారము ఇయ్యవలెననియు, శిశువునకు ఎట్టి ఆహారమియ్యవలెననియును విశదముగా తెలియును. శిశువు భూలోకమునందు జన్మించిన పిమ్మట సాధారణముగా ఏడు సంవత్సరముల వరకును జీవాత్మ శీశుశరీరమునందు సుష్ఠుగా ప్రవేశించుట లేదు. గనుకనే శిశుశరీరము చేయు కార్యములకు జీవాత్మకు పూచి లేదు. ధర్మశాస్త్రములును ఇప్పటి చట్టదిట్టములు కూడ శిశువులు ఏడేండ్లునిండునంతకు ముందు చేయు తప్పులను గణింపవు. జీవాత్మ శరీరమందు ప్రవేశించిన వెనుక ఉపనయన మను సంస్కారము జరుగును. ఆ సందర్భము ద్విజాతుల శిశువుల రెండవజన్మము అని శాస్త్రములు చెప్పుచున్నవి. శిశువుకు సప్తమవర్షము వరకును జీవాత్మ చాలమట్టుకు "ఆస్ట్రల్ ప్ళేను" అను భువర్లోకమునందు వ్యవహరించుచు సకృత్తుగా శిశుశరీరమందు ప్రవేశించి తనయునికిని గాన్పించుచుండును. చిన్నబిడ్డలకు భువర్లోకపు చూపులు కనబడుట కలదు. భువర్లోకవాసులగు తన స్నేహితులను శిశుశరీరధారియైన జీవాత్మ చూచుచు, సంతోషవ్యాపార