114
ఆత్మవిచారము
[5 వ
వరకును జీవాత్మ తన కొత్తదేహములో ప్రవేశించకనే శరీరముయొక్క కట్టుటను మాత్రము చాల అక్కరతో కనిపెట్టియుండును. ఏడవనెల ముగియు సమయమందు జీవాత్మ శిశువుయొక్క శరీరమునందు ప్రవేశించును.
జీవాత్మయొక్క స్పందశక్తి అతివేగమైనది. శిశువుయొక్క ఏడునెలల గర్భవయస్సుగల శరీరము అతికోమలమైనది. అత్యుగ్రమగు జీవాత్మస్పందఆందోళనమునకు సహించుటకు శక్తిలేక క్వచిత్తుగా ఏడవనెలలోనే శిశువు మాతృగర్భము వదలి నేల పడుటయు కలదు.
ఛాందోగ్యోపనిషత్తునందు పంచాగ్ని విద్య యని యొక భాగమున్నది. అందు జీవాత్మ తనయొక్క శుద్ధమానసశరీరము (శుద్ధమనోమయశరీరము) నందుండి మరల భూలోకమందు జన్మించుటకు సిద్ధమైనపుడు ప్రారబ్ధకర్మనిర్ధారము కాగానే మహర్లోకమునుండి (ద్యులోకము) స్వర్గలోకమునకు అతనిని దేవతలు తెత్తురనియు అది మొదటిహోమగుండమనియు; ద్యులోక హోమమువల్ల "సోమో రాజా సంభవతి" అని చంద్రలోకపు వాడు పుట్టుననియు (చంద్రలోకము అనగా భువర్లోకము. అక్కడ పుట్టునది కామమయశరీరము) ; చంద్రలోకము రెండవ హోమగుండమనియు; ఆ హోమమువల్ల పర్జన్యు డను వర్షము పుట్టుననియు; ఆ వర్షమును పృథివీలోకము అను మూడవ హోమగుండమునందు హోమము చేసిరనియు; అందువలన అన్నము పుట్టెననియు ; నాలుగవ హోమగుండమందు దేవతలు హోమముచేసిరనియు; అందువలన రేతస్సు పుట్టెననియు ; అయిదవహోమ