Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

111

బీజమందు ఇమిడియుండు శుద్ధశక్తులు, అశుద్ధశక్తులు ఇవన్నిటిని వ్యక్తీకరించగల కామమయశరీరమును సంపాదించుకొనును. అనంతరము ఆ చిన్న దేవతవెంబడి భూర్లోకమునకు వచ్చును. ఆ దేవత భూర్లోకమందు ఒక విచిత్రమైన పనిచేయును. అనగా తన స్వాధీనమందుండు జీవాత్మ అనుభవించవలసిన ప్రారబ్ధకర్మను అనుభవించుటకు ఎట్టి అంగములుండవలెనో అవన్నియు బాగుగ చింతించి భూలోకపు సూక్ష్మఅణువులతో నొక ఛాయాశరీరమును కట్టును. గుడ్డితనమును అనుభవించవలసినదిగా ప్రారబ్ధకర్మయందుండినయెడల ఛాయాశరీరమందు కన్నులను విడిచిపెట్టును. ఆజానుబాహువై ఉన్నత పురుషుడుగానుండవలెనని ప్రారబ్ధ కర్మ యందుంటే ఆ విధముగా ఛాయాశరీరమును కట్టును. సంగీతశాస్త్రము అభ్యసించి గాయకుడుగా నుండవలసినదిగా ప్రారబ్ధకర్మ యందుండినయెడల మంచిశారీరమును ఇయ్యగల అణువులతో కుత్తుకను గట్టును. అజీర్ణరోగముల ననుభవించవలసిన ప్రాప్తి యుండినయెడల బలహీనమైన యణువులతో జీర్ణకోశమును గట్టును. ఈ విధముగా ప్రారబ్ధకర్మానుభవమునకు కావలసిన పరికరములనన్నిటినిని ఆ ఛాయాశరీరమందు ఇమిడ్చియుంచి రాబోవుజన్మమునందు జీవాత్మకు ఏ స్త్రీ తల్లిగానుండవలెనో ఆ స్త్రీనిని ఏ పురుషుడు తండ్రిగానుండ వలసినదిగా ప్రారబ్ధకర్మయందున్నదో అట్టి పురుషునిని యొకస్థలమునందు చేరునట్టు చేసి ఆ స్త్రీకి గర్భధారణయగునట్టు చేయును. ప్రారబ్ధ కర్మయను ఫర్వానాను చేతనుంచుకొనియుండు చిన్న దేవత చేయు యుక్తులు అనేకములు. ఇక ముందు తనతండ్రి