110
ఆత్మవిచారము
[5 వ
అనుభవించగలడు. "భోగాయతనం ఇదం వపుః”. ఇంద్రియములవల్లనే జీవాత్మ బహి:ప్రపంచమును ఎరుగును. అట్టి యింద్రియగోళములు ఈ శరీరమందున్నవి. ఈ శరీరమునకు పుట్టుక, వయస్సు, ముసలితనము, మరణము మొదలగు అవస్థలు గలవు. "స్థూలస్య సంభవ జరా మరణాది దుఃఖాః" అని యున్నది.
ఇట్టి శరీరముయొక్క పుట్టుకయొక్క సందర్భములను విచారింతము. ఈ విచారమందు మొదటి అంశము కర్మ. కర్మయనగా జీవాత్మ మనస్సుతోచేసిన కార్యములయొక్క ఫలము. ఈ విషయమును విపులముగా ముందు వ్రాయనగును. జీవాత్మ జన్మమునకు వచ్చుటకుముందు వారియొక్క పుణ్యపాపఫలములలో రాబోవు జన్మమందు అనుభవించుటకు అనుకూలమైనంత భాగమును వేరు దీసి కర్మవివరణదేవతలు ఆ భాగమును ఒకచిన్న దేవతచేతికి ఇత్తురు. వీడదీసిన భాగమునకు ప్రారబ్ధకర్మ యని పేరు. ఈ చర్య మహర్లోకమందు నిర్ధారింపబడును. అపుడు జీవాత్మ తనయొక్క శుద్ధమనోమయశరీరమం దుండును. తన ప్రారబ్ధకర్మయని నిర్ధారింపబడిన ఫర్వానాను చేతబూనిన చిన్న దేవతవెంబడి జీవాత్మ క్రిందిలోకములకు దిగును. స్వర్గలోకమునందు ప్రవేశించి తన (అశుద్ధ) మనోమయదేహబీజమందలి శక్తులను వెలిపరచుటకు ఎంతటి శక్తిమంతమైన (అశుద్ధ) మనోమయశరీరము అవశ్యమో అట్టి మనోమయశరీరమును సంపాదించుకొనును. పిమ్మట తనకు అప్పటివరకు నుండు శుద్ధమనోమయశరీరము, అశుద్ధమనోమయశరీరము ఈ రెండు శరీరములతో సహ "ఆస్ట్రల్ ప్ళేను" అను భువర్లోకమునకు దిగును. అచ్చట తన కామమయశరీరపు దేహ