Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

107

ఐదు తత్త్వములకును సంబంధించినవి ఐదు "ప్ళేనులు" అని దివ్యజ్ఞానసమాజపు వారుపయోగించిన

1. నిర్వాణిక్ ప్ళేను Nirvanic Plane
2. బుద్ధిక్ ప్ళేను Buddhic Plane
3. మెంటల్ ష్ళేను Mental Plane
4. ఆస్ట్రల్ ప్ళేను Astral Plane
5. ఫిజికల్ ప్ళేను Physical Plane

అను పంచతత్త్వముల ప్ళేనులు లేక లోకభాగములయందు జీవాత్మకు ఉపయోగించుటకుగా వారు ఐదు శరీరములను పైన వివరించిన ప్రకారము సంపాదించుకొనిరి. ఇవి అయిదుశరీరములు.

స్థూలశరీరము (ఫిజికల్ బాడి) నందు ప్రవేశించి కొంతదూరము అన్నిదిక్కులయందు వ్యాపించి కామమయశరీరము (ఆస్ట్రల్ బాడి) న్నది.

స్థూల-కామమయశరీరములు రెండింటియందును ప్రవేశించి కొంతదూరము వెలుపల అన్నిదిక్కులయందును వ్యాపించి ద్వివిధంబుగా భాగింపబడిన మనోమయశరీరమున్నది.

స్థూల-కామమయ-మనోమయశరీరములు మూటియందును ప్రవేశించి వెలుపల అన్నిదిక్కులయందును మించి బుద్ధిక్ బాడి యనునది యున్నది.

స్థూల-కామమయ-మనోమయ-బుద్ధిక్ బాడీలు నాలుగింటను ప్రవేశించి అన్నిదిక్కులయందును మించి "ఆరిక్ ఎగ్" అను "జీవకోశము" మున్నది.