106
ఆత్మవిచారము
[5 వ
"ఆరిక్ ఎగ్" (Auric Egg) అని యుపయోగించి యున్నారు. కనుక జీవాత్మకు పాంచభౌతిక ప్రపంచమునందుండు శరీరములు:
1. "ఆరిక్ ఎగ్” అను ఆకాశతత్త్వప్రధాన శరీరము. - Auric Egg
2. ఇందులోపల సంకుచితమై "బుద్ధిక్ బాడి" అను వాయుతత్త్వ ప్రధానమైన శరీరము. - Buddhic Body
3. ఈ రెండవ శరీరములో మరియంత సంకుచితమై రెండుతెగలగా భిన్నమై తేజస్తత్త్వప్రధానమై మనోమయ శరీరమున్నది. - 1. Higher Mental Body శుద్ధమానస శరీరము 2. Lower Mental Body అశుద్ధమానస శరీరము
4. ఈ మనోమయ శరీరమందు అంతకన్న చాలసంకుచితమై అప్తత్త్వప్రధానమైన కామమయ శరీర మున్నది. - Astral Body
5. ఈ కామమయశరీరమందు దానికన్న చాలచిన్నదై మనకు ఇంద్రియగోచరమైన స్థూలశరీరము పృథివీతత్త్వ ప్రధానమైయున్నది. - Physical Body
ఈ విషయమును వివరముగా మననము చేసి అవగాహన పరచుకోవలెను. బ్రహ్మాండము అను అధ్యాయము చదువబోవునపుడు ఈ అర్థములు అత్యావశ్యకము గానుండును.