Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ఆత్మవిచారము

[5 వ

స్థితియొక్కయు, వాని యుపయోగములయొక్కయు వివరములను సంగ్రహముగా వ్రాయదలచియున్నాము. ఈ అధ్యాయమునందే అనాత్మబంధములలో నతి బలవంతమైన మనస్సుయొక్క స్వభావమునుగురించియు ఆ మనస్సును స్ఫుటీకరించి వికసింపచేసినప్పుడు అది యెంత విచిత్రకార్యములను చేయునో ఆ వివరమును సంగ్రహముగా వ్రాయనగును. ఇవంతయు ప్రవృత్తిమార్గము అను ముఖ్యాంశముగా నెరుగవలయును. ఒక్కొక యంశమునుగురించియు నొక్కొక గ్రంథమే వ్రాయవలసినంత విషయములున్నవి. అయినను అన్ని ముఖ్యాంశములనుగురించియు కొంతకొంత తెలిసికొనిన పిమ్మట ప్రతి అంశమునుగురించియు మరియు ననేకవిషయములనుగురించియు చదువవచ్చునని యుద్దేశించి ఈ యధ్యాయమందే కాక యిక రాబోవు అధ్యాయములయందు సహ అంశములనుగురించి సంగ్రహముగానే వ్రాయ నుద్దేశము.

దేహములు

ఇంతకుముందు తృతీయాధ్యాయమునందు (43 వ పుట యందు) జీవాత్మ పాంచభౌతిక లోకమునందు అనుభవసంపాద నార్థము ప్రవేశించినపుడు అనేక శరీరములను సంపాందించుకొనుటకు ప్రయత్నముచేసి ఏ యే తత్త్వము ఏ యే లోకమందు ప్రధానాంశమో ఆ యా లోకమునందు వ్యవహరించుటకుగా ఆ యా తత్త్వముయొక్క భూతసూక్ష్మమును సంపాదించికొనెను అని చెప్పబడెను. ఆకాశతత్త్వప్రధానమైన సత్యలోకమునందు వ్యవహారము జరుపుటకుగా ఆకాశతత్త్వపు