ఐదవ అధ్యాయము
బీజం సంసృతి భూమిజస్యతు తమో దేహాత్మ ధీరంకురో ।
రాగః పల్లవ మమ్బుకర్మతు నపుః స్కంధో౽సవశ్శాఖికా ॥
అగ్రాణీంద్రియ సంహతిశ్చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం ।
నానాకర్మ సముద్భవం బహువిధం భోక్తాత్ర జీవః ఖగః ॥
ప్రవృత్తిమార్గము.
ఇదివరకును జీవాత్మగారు వివిధయోనులయందు జన్మించుచువచ్చి చివరకు మనుష్యశరీరమును ప్రవేశించిరని చెప్పబడెను.
ఇచ్చట ముఖ్యమైన యంశము నొక్కటిని చెప్పవలసి యున్నది. ఆత్మానాత్మవిషయమునుగురించి యిపుడే కొంత విచారించిన నిక ముందు తద్వివేచనమునుగురించి విచారించుట సులభము. ఆత్మయనగా జీవాత్మ. ఉపక్రమాధ్యాయమునందు వీరికి "క్రీడకుడు” అను పేరు నుపయోగించినాము. వీరికి సహాయముగా "క్రీడారంగము" అనునది యేర్పడినది. ఇది యనాత్మ. శ్రీమద్భగవద్గీత 13 వ అధ్యాయమునందు చెప్పిన క్షేత్రము అంతయు ననాత్మ. వేదాంతసంప్రదాయమునందు అనాత్మకు "బంధము" అని పేరు. అనాత్మబంధములు అనేకములున్నను ప్రకృతమందు ఈ అధ్యాయమునందు శరీరములయొక్కయు, వాని